»   » నాని కొత్త సినిమా 'భలే భలే మగాడువోయ్' ఫస్ట్ లుక్

నాని కొత్త సినిమా 'భలే భలే మగాడువోయ్' ఫస్ట్ లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాని హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'భలే భలే మగాడువోయ్'. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ఈ రోజు విడుదల చేసారు. ఈ చిత్రం ఫన్ తో నడిచే లవ్ స్టోరీగా నడుస్తుందనే అర్దం వచ్చేటట్లుగా ఈ ఫస్ట్ లుక్ ని వదిలారు. మీరు ఈ లుక్ పై ఓ లుక్ వేయండి. ఈ చిత్రంలో హీరోయిన్ గా లావణ్యం త్రిఫాఠి చేస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో నాని పాత్ర చిత్రణ సరికొత్త పంథాలో వుంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. శ్రీదివ్య కథానాయికగా నటించనున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుంది. టైటిల్‌కు సంబంధించిన అధికారిక సమాచారాన్ని త్వరలో వెల్లడించనున్నారు.

Nani's Bhale Bhale Magadivoi First Look

ఇక నాని త్వరలో....'బాహుబలి' ఆడియోకు యాంకర్ గా వ్యవరించనున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న 'బాహుబలి' సినిమా తొలి భాగం 'బాహుబలి ది బిగినింగ్‌' పాటల విడుదల కార్యక్రమం ఈ నెల 31న హైదరాబాద్‌లో జరగనుంది. ఇదే వేదికపై రెండు నిమిషాల ఐదు సెకన్ల నిడివితో సాగే థియేట్రికల్‌ ట్రైలర్‌ని కూడా విడుదల చేస్తారు. ఈ కార్యక్రమానికి హీరో నాని వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు.

ఈ విషయాన్ని రాజమౌళి తన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ''మా 'బాహుబలి' ఆడియో విడుదల కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి అంగీకరించిన మా 'ఈగ'కు ధన్యవాదాలు'' అని రాసుకొచ్చారు రాజమౌళి.

English summary
First Look poster of Nani and Lavanya Tripati starrer 'Bhale Bhale Magadivoi' has been unveiled Today.'Bhale Bhale Magadivoi' is the joint venture of Geetha Arts 2 and UV Creations. Music of the film is by Gopi Sundar. The film is in the last leg stage.
Please Wait while comments are loading...