'మాస్'కు పూనకం వచ్చేలా.. దుమ్మురేపుతోన్న నాని కొత్త పాట(వీడియో)

Recommended Video

'మాస్'కు పూనకం వచ్చేలా.. దుమ్మురేపుతోన్న నాని కొత్త పాట

తెలుగు సినిమాల్లో హీరో అంటే మానవాతీతమైన కొన్ని లక్షణాలు ఉంటాయి. హీరోని మించిన ధీశాలి, బలశాలి ఈ ప్రపంచంలో అప్పటిదాకా పుట్టి ఉండడు. అతన్ని ఎదుర్కోవడం కొన్నిసార్లు పంచభూతాలకు కూడా సాధ్యం కాదు.

ఇక హీరోయిన్లయితే హీరో కనిపిస్తే చాలు.. టెంప్ట్ అయిపోదామన్నట్లుగా కనిపిస్తారు. ఇలా వాస్తవానికి వెయ్యి కి.మీ దూరంలో ప్రయాణిస్తున్న తెలుగు హీరోల పాత్రల నుంచి 'నాని' ప్రేక్షకులకు కాస్త ఊరట కల్పించాడు.

సహజత్వంతో కూడిన పాత్రలతో సగటు ప్రేక్షకుడికి కాస్త కొత్త అనుభూతిని అందించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే 'కృష్ణార్జున యుద్ధం'తో మరో విభిన్న పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నాని..

 డ్యూయల్ రోల్:

డ్యూయల్ రోల్:

'కృష్ణార్జున యుద్ధం' సినిమాతో కెరీర్‌లో మూడోసారి డ్యూయల్ రోల్ చేస్తున్నాడు నాని. తాజాగా విడుదల చేసిన సాంగ్‌లో నాని ఊర మాస్ గెటప్‌లో కనిపిస్తున్నాడు. లుక్స్ బట్టి.. నాని మరోసారి విభిన్న తరహా పాత్రలో నటించబోతున్నట్లు అర్థమవుతోంది.

ప్రయోగమే..:

ప్రయోగమే..:

పాట కూడా ఇదివరకటి తెలుగు సినిమా పాటల కన్నా భిన్నంగా ఉందనే చెప్పాలి. లిరిక్స్ పరంగా.. మ్యూజిక్ పరంగా.. ఇలాంటి పాట తెలుగు సినిమాలో కొత్త ట్రెండే. ఈ పాట రాసింది, పాడింది పుట్టా పెంచలదాస్ అనే బాతిక్ ఆర్టిస్ట్ గా తెలుస్తోంది.

ఇప్పటివరకు వినని పదాలతో..:

ఇప్పటివరకు వినని పదాలతో..:

మాస్ సాంగ్ అనగానే సహజంగా హీరోను హైలైట్ చేసేలా.. అతని ఇమేజ్ చుట్టూ తిరిగే పాటలు పెట్టడం తెలుగు సినిమాల్లో మామూలే. కానీ ఈ సాంగ్‌లో మాత్రం 'కమలపూడి కట్టే మీద కన్నెపిల్లల జోరే చూడు మామా..', 'బులుగు పూల చొక్కా..' లాంటి కొత్త రకమైన లిరిక్స్ వినొచ్చు.

మాస్‌ను ఆకట్టుకునేలా..:

మాస్‌ను ఆకట్టుకునేలా..:

పాటలో తమిళ వాసన కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా.. చిత్తూరు జిల్లా నేపథ్యంలోనే ఈ పాట సాగుతుందని తెలుస్తోంది. కృష్ణార్జున యుద్దంలో.. కృష్ణ పాత్ర చిత్తూరు నేపథ్యంగా సాగుతుందని, అందుకే అక్కడి వాడుక పదాలతోనే లిరిక్స్ రాయించారని సమాచారం. ఈ పాటకు హిప్ హాప్ తమిజా ఇచ్చిన ట్యూన్ మాస్ ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

 'పాప్ సింగర్' పాత్ర కూడా..:

'పాప్ సింగర్' పాత్ర కూడా..:

ఇప్పటిదాకా పక్కింటిబ్బాయి పాత్రలు, ప్రేమ కథల్లోనే ఎక్కువగా కనిపించిన నాని.. ఈసారి పూర్తి విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లు టాక్. కృష్ణ పాత్రలో ఊర మాస్ గెటప్‌లో కనిపిస్తున్న నాని.. అర్జున్ పాత్రలో పాప్ సింగర్‌గా కనిపిస్తాడన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకరకంగా ఈ సినిమాతో 'నాని'లో కొత్త యాంగిల్ బయటపడుతుందంటున్నారు.

రిలీజ్ డేట్..:

కృష్ణ పాత్రకు సంబంధించిన లుక్ బయటకు రావడంతో.. రెండో పాత్రలో నాని లుక్ ఎలా ఉండబోతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. అయితే అర్జున్ పాత్రకు సంబంధించిన లుక్ ఎప్పుడు విడుదల చేస్తారన్న దానిపై క్లారిటీ లేదు. సినిమా మాత్రం ఏప్రిల్ 12 న విడుదల చేసేందుకు ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X