Don't Miss!
- News ఏపీకి మరో వరం ప్రకటించిన మోడీ
- Sports T20 World Cup: ఆ కుర్రాడికి టికెట్ కన్ఫార్మ్- సెహ్వాగ్
- Finance Railway News: రైలు ప్రయాణికులకు శుభవార్త..! టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు తగ్గింపు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
జెర్సీ చిత్రంలో గందరగోళం.. త్రివిక్రమ్, దిల్ రాజుపై రూమర్స్.. ఏం జరిగిందటే!
Recommended Video
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం జెర్సీ. మళ్ళిరావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాని ఈ చిత్రంలో క్రికెటర్ పాత్రలో నటిస్తుండడం ఆసక్తి రేపుతోంది. ఈ చిత్రంలో నాని పాత్ర పేరు అర్జున్. ఇటీవల విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. డబుల్ హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న నానికి గత ఏడాది కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ చిత్రాలు బ్రేక్ వేసాయి. విభిన్నమైన కథతో వస్తున్న జెర్సీ చిత్రంపై నాని ఆశలు పెట్టుకుని ఉన్నాడు. జెర్సీ చిత్రం ఏప్రిల్ లో విడుదల కానుండడంతో చిత్ర యూనిట్ పాటలు విడుదలచేస్తూ ప్రచుర కార్యక్రమాలు ప్రారంభించింది. జెర్సీ చిత్ర క్లైమాక్స్ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.
ఆ క్రికెటర్ కథ
మాజీ క్రికెటర్ రామన్ లాంబా 90వ దశకంలో టీం ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 32 వన్డే మ్యాచ్‌లు, 4 టెస్టులు ఆడిన రామన్ లాంబా దురదృష్టవశాత్తూ 1998లో ఫీల్డింగ్ చేస్తూ బంతి బలంగా తగిలి మరణించాడు. క్రికెట్ లో జరిగిన విషాద ఘటనల్లో ఇది ఒకటి. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని నటిస్తున్న జెర్సీ చిత్రం రామన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోందనే ప్రచారం జరుగుతోంది.
గౌతమ్ తిన్ననూరి
మళ్ళిరావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. వైవిధ్యభరితమైన కథ కావడంతో నాని ఈ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర క్లైమాక్స్ లో హీరో మరణిస్తాడని అనేక వార్తలు వస్తున్నాయి. ఈ చిత్ర క్లైమాక్స్ గురించి కొన్ని కొత్త రూమర్స్ కూడా పుట్టుకొచ్చాయి. జెర్సీ చిత్రం విషయంలో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, దిల్ రాజు ఇన్వాల్వ్ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్ర యూనిట్ స్పందించినట్లు తెలుస్తోంది.
ఆస్తులు పంచే వరకే తండ్రి, కట్నం ఇచ్చే వరకే మామ.. ఎన్టీఆర్ ఫ్యామిలీ టార్గెట్‌గా ఆర్జీవీ!
రెండు క్లైమాక్స్‌లు
జెర్సీ చిత్రం కోసం గౌతమ్ తిన్ననూరి రెండు క్లైమాక్స్ లు రాసుకున్నారట. వీటిలో ఒకదానిని సెలెక్ట్ చేయాల్సిందిగా త్రివిక్రమ్ శ్రీనివాస్, దిల్ రాజుని సలహా అడిగినట్లు ప్రచారం జరుగుతోంది. నెగిటివ్ ఎండింగ్ ని మన తెలుగు ఆడియన్స్ అంగీకరించారు అని దిల్ రాజు తెలిపాడట. త్రివిక్రమ్ కూడా తన అభిప్రాయాన్ని దర్శకుడికి చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్ పై చిత్ర యూనిట్ స్పందించింది.
అవాస్తవం
జెర్సీ క్లైమాక్స్ విషయంలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం అని చిత్ర యూనిట్ లోని కొందరు స్పందించినట్లు సమాచారం. గౌతమ్ తిన్ననూరి ముందుకుగా అనుకున్న క్లైమాక్స్ ప్రకారమే షూటింగ్ పూర్తి చేశారని అంటున్నారు. ఈ చిత్రంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదని అంటున్నారు. ఇప్పటికే జెర్సీ షూటింగ్ ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నాని సరసన శ్రద్దా శ్రీనాధ్ హీరోయిన్ గా నటిస్తోంది. అనిరుద్ సంగీత దర్శకుడు.