ఐదుగురితో కలిసి వచ్చేసిన ‘గ్యాంగ్ లీడర్’
నేచురల్ స్టార్ నాని తాజాగా నటిస్తున్న చిత్రం 'గ్యాంగ్ లీడర్'. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. సినిమా షూటింగ్ ప్రారంభమైన కొద్దిరోజులకే టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేసి, సరికొత్త పద్దతికి శ్రీకారం చుట్టింది ఈ చిత్ర యూనిట్. ఈ టీజర్‌లో ప్రముఖ కమెడియన్ సత్య ఒక్కో పాత్రను పరిచయం చేస్తుంటాడు. చివరకు వీళ్లందరికీ ఒక లీడర్ ఉంటాడు.. అతడే 'గ్యాంగ్ లీడర్' అని చెబుతాడు. దీనికి తెలుగు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన కూడా వచ్చింది.
ఈ రెస్పాన్స్ వల్ల నాని అండ్ కో సరికొత్తగా ప్రమోషన్ చేపడుతోంది. ఇందులో భాగంగానే ప్రీ లుక్, ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్, టీజర్ వేరు వేరుగా విడుదల చేస్తామని వెల్లడించారు. ఇందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ రెండు రోజుల క్రితం విడుదలైన విషయం తెలిసిందే. దీనికి మంచి స్పందన వచ్చింది. ఇక, అదే రోజు సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్, టీజర్ ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పేసింది చిత్ర యూనిట్.

దాని ప్రకారం సోమవారం చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ మేరకు చిత్ర హీరో నాని ట్విట్టర్ వేదికగా ఈ పోస్టర్ వదిలిడు. అంతేకాదు, ''బామ్మ.. వరలక్ష్మి.. ప్రియ.. స్వాతి.. చిన్ను.. రివేంజర్స్ కలిశారు'' అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు. ఈ పోస్టరులో ఒక పాపతో సహా ఐదురుగు ఆడవాళ్లు నాని వెనుక నిల్చుని బైనాక్యూలర్‌తో ఏదో చూస్తుంటారు. ఈ పోస్టర్ నాని అభిమానులనే కాకుండా సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
'గ్యాంగ్ లీడర్'లో నానికి జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది. అలాగే 'ఆర్ఎస్ 100' హీరో కార్తికేయ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. వీరితో పాటు ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్, జైజా, సత్య తదితరులు నటిస్తున్నారు. ఇదిలాఉండగా, 'గ్యాంగ్ లీడర్' తొలి పాటను ఈనెల 18న, టీజర్‌ను 24న విడుదల చేయనున్నారు. అలాగే, ఈ సినిమాను ఆగస్టు నెలాఖరున ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications











