రూమర్లకు పుల్‌స్టాప్ పెట్టిన ‘గ్యాంగ్ లీడర్’ టీమ్.. అంతా కలిసి వచ్చేశారు

నేచురల్ స్టార్ నాని తాజాగా నటిస్తున్న చిత్రం 'గ్యాంగ్ లీడర్'. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను విక్రమ్ కే కుమార్ తెరకెక్కిస్తున్నాడు. కొద్దిరోజుల క్రిందట ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. అలాగే దీనికి సంబంధించిన టైటిల్ టీజర్ విడుదలైంది. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా వచ్చింది. అనంతరం ఈ సినిమాపై బోలెడు రూమర్లు హల్‌చల్ చేశాయి. బడ్జెట్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్లకు చిత్ర యూనిట్ పుల్‌స్టాప్ పెట్టేసింది.

'గ్యాంగ్ లీడర్' ప్రీ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం శనివారం (జూలై 13) విడుదల చేసింది. ఈ మేరకు హీరో నాని తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ ''మేమంతా కలిశాం.. మేము రెడీగా ఉన్నాం.. మేమంతా ఒక గ్యాంగ్.. నేను గ్యాంగ్ లీడర్'' అంటూ ట్వీట్ చేశాడు. చేతులు మాత్రమే కనిపించేలా ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. అంతా కలిసి ఒక వ్యక్తికి ప్రామిస్ చేస్తున్నట్లు చూపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Nanis Gang Leader pre look Release

వాస్తవానికి ఈ ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేస్తామని హీరో నాని శుక్రవారమే ప్రకటించాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ వీడియోను ఉంచాడు. ''విక్రమ్ గానీ, మైత్రీ గానీ సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టాలంటే చాలా భయపడిపోతున్నారు. వాళ్లు భయపడుతున్నారనేకన్నా మీరు భయపెట్టారు అంటే కరెక్టేమో! 'గ్యాంగ్ లీడర్' అప్‌డేట్స్ గురించి అడుగుతూ. ఒక రకంగా చెప్పాలంటే చాలా మంచి పని చేశారు.

మరో విషయం ఏంటంటే, ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒకటి విడుదల చేసి కొంత గ్యాప్ ఇచ్చి మళ్లీ ఇంకా ఏదో ఒకటి రిలీజ్ చేసి మళ్లీ గ్యాప్ ఇచ్చి.. అలా చేయకూడదు అనుకున్నాం. ఒకసారి మ్యూజిక్ స్టార్ అయ్యిందంటే అది రిలీజ్ వరకు వినపడాలి అనుకున్నాం. సో మేం రెడీగా ఉన్నాం. మీరు రెడీనా? మొదలెడదామా? సో జులై 30 అంటే రేపు ఉదయం 11 గంటలకు 'గ్యాంగ్ లీడర్' ప్రీలుక్ బయటికి రాబోతోంది. అందులో మన మిగిలిన కార్యక్రమాల వివరాలు ఉంటాయి. రెడీ.. స్టార్ట్ మ్యూజిక్!'' అని నాని ఆ వీడియోలో వెల్లడించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X