twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రికార్డు స్థాయిలో గ్యాంగ్‌లీడర్ ప్రీ బిజినెస్.. నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్‌గా

    |

    Recommended Video

    Nani's Gang Leader Pre-Release Business Details Worldwide

    టాలీవుడ్‌లో నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం గ్యాంగ్ లీడర్. ఎంసీఎ, దేవదాస్, జెర్సీ విజయాల తర్వాత ఈ సినిమా వస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకు సంబంధించిన ప్రోమోలు, పాటలు గ్యాంగ్ లీడర్‌పై ఆసక్తిని పెంచాయి. ఐదుగురు మహిళలు, అమ్మాయిల కీలక పాత్రలుగా, ఎమోషనల్ కంటెంట్‌తో నాని సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. భారీ అంచనాల మధ్య నాని కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. వాటి వివారాలు ఇలా ఉన్నాయి.

    నైజాం, సీడెడ్‌లో అత్యధికంగా

    నైజాం, సీడెడ్‌లో అత్యధికంగా

    నైజాంలో గ్యాంగ్ లీడర్ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నైజాంలో ఈ చిత్రం రూ.8 కోట్ల మేరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సీడెడ్‌లో రూ.2.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.2.50 కోట్ల మేర జరగడం గమనార్హం. ఈ ప్రాంతాల్లో నానికి ఇదే అత్యుత్తమ ప్రీ రిలీజ్ బిజినెస్ అని చెప్పుకొంటున్నారు.

    ఆంధ్రాలో రికార్డు స్థాయిలో

    ఆంధ్రాలో రికార్డు స్థాయిలో

    ఇక ఆంధ్రా విషయానికి వస్తే.. తూర్పుగోదావరి జిల్లాలో రూ.1.60 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.1.20 కోట్లు, గుంటూరులో రూ.1.75 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.1.40 కోట్లు, నెల్లూరులో రూ.0.75 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా ఈ చిత్రం ఏపీ, తెలంగాణలో కలిపితే రూ.20.80 కోట్ల మేరు బిజినెస్ జరిగినట్టు సమాచారం.

     కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో

    కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో

    ఇక కర్ణాటకలో రూ.1.4 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో రూ.40 లక్షల మేర ప్రీ రిలీజ్ వ్యాపారం జరిగింది. ఇక ఓవర్సీస్‌లో కూడా భారీ మొత్తానికి డిస్ట్రిబ్యూషన్ హక్కులు అమ్మారు. అమెరికాలో రూ.4 కోట్లు, మిగితా దేశాల్లో రూ.1.4 కోట్లుకు అమ్మడం జరిగింది.

    ఎంత వసూలు చేస్తే లాభాల్లోకి వస్తుందంటే

    ఎంత వసూలు చేస్తే లాభాల్లోకి వస్తుందంటే

    ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.28 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం విడుదల తర్వాత లాభాల్లోకి రావాలంటే రూ.29 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుంది. ఇక ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 21.5 కోట్ల మేర వసూళ్లు సాధిస్తే లాభాల్లొకి వచ్చే పరిస్థితి ఏర్పడింది.

     నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లు ఇవే

    నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లు ఇవే

    ఇక నాని కెరీర్‌లో ఇప్పటి వరకు భారీగా వసూళ్లు సాధించిన చిత్రాలు ఇవే.. జెర్సీ చిత్రం రూ.26 కోట్లు, దేవదాస్ 37.2 కోట్లు, కృష్ణాంజనేయ యుద్ధం 26 కోట్లు, ఎంసీఏ రూ.30 కోట్లు, నిన్నుకోరి రూ.20 కోట్లు, నేను లోకల్ రూ.20 కోట్ల వసూళ్లు సాధించాయి.

    English summary
    Nani's latest movie Gang Leader is set to release in September 13th. As part of the promotion, A song from movie is released on August 15th, Which got good response. This movie made Rs.28 crores overall business.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X