twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గ్యాంగ్ లీడర్‌గా నాని.. ఎప్పుడొస్తున్నాడో తెలుసా?

    |

    వరుస పరాజయాలతో సతమవుతున్న నాని కెరీర్‌లో నూతనోత్సాహాన్ని నింపింది జెర్సీ మూవీ. ఇటీవలే విడుదలైన ఈ సినిమా సెన్సేషన్ కలెక్షన్స్ రాబట్టి నానిని నాచురల్ స్టార్ అని మరోసారి నిరూపించింది. దీంతో నాని కొత్త సినిమాపై అందరి కళ్లు పడ్డాయి. జెర్సీ తర్వాత నాని తన తదుపరి సినిమాను విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది చిత్రయూనిట్.

    ప్రపంచవ్యాప్తంగా గ్యాంగ్ లీడర్ సినిమా ఆగస్ట్ 30 వ తేదీన విడుదల చేయనున్నామని ప్రకటించారు. ఈ చిత్రానికి గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ ప్రకటించగానే మెగా అభిమానుల నుంచి అభ్యంతరం వ్యక్తం చేశారు. చిత్రంలో దొంగల గ్యాంగ్ కి లీడర్‌గా, ఓ గజ దొంగగా నాని నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. నానితో అయిదుగురు ఆడవాళ్లు ఆయన ముఠాలో ఉంటారని సమాచారం. చిత్రంలో దొంగతనం నేపథ్యంలో తెరకెక్కిన పలు సన్నివేశాలు కామెడీ పండిస్తాయని అంటున్నారు. విక్రమ్ టేకింగ్ చిత్రానికి హైలైట్ కానుందని తెలుస్తోంది.

    Nanis Gang Leader Release Date Fix

    పలు సూపర్ హిట్ సినిమాలు అందిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ నెగెటివ్ రోల్ లో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రంలో మేఘా ఆకాష్, ప్రియాంక అరుళ్ అనే ఇద్దరు భామలు నాని సరసన ఆడిపాడుతున్నారు. అనిరుద్ రవిచంద్రన్ బాణీలు కడుతున్నారు. చూడాలి మరి మంచి జోష్ లో ఉన్న నానికి ఈ సినిమా ఏ రేంజ్ హిట్ ఇస్తుందో.

    English summary
    After Jersey hero Nani's next movie is Gang Leader. The movie has fixed Release Date. film unit confirm the same on social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X