Don't Miss!
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Technology 6.9 అంగుళాల డిస్ప్లే, 64MP కెమెరా ఫోల్డబుల్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. అమెజాన్ సేల్ పూర్తి వివరాలు..!
- News అనుభవజ్ఞుడైన నాయకుడు చంద్రబాబు: ప్రధాని మోదీ కితాబు.. సెలబ్రేషన్స్ ఇలా
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
గ్యాంగ్ లీడర్‌గా నాని.. ఎప్పుడొస్తున్నాడో తెలుసా?
వరుస పరాజయాలతో సతమవుతున్న నాని కెరీర్లో నూతనోత్సాహాన్ని నింపింది జెర్సీ మూవీ. ఇటీవలే విడుదలైన ఈ సినిమా సెన్సేషన్ కలెక్షన్స్ రాబట్టి నానిని నాచురల్ స్టార్ అని మరోసారి నిరూపించింది. దీంతో నాని కొత్త సినిమాపై అందరి కళ్లు పడ్డాయి. జెర్సీ తర్వాత నాని తన తదుపరి సినిమాను విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది చిత్రయూనిట్.
ప్రపంచవ్యాప్తంగా గ్యాంగ్ లీడర్ సినిమా ఆగస్ట్ 30 వ తేదీన విడుదల చేయనున్నామని ప్రకటించారు. ఈ చిత్రానికి గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ ప్రకటించగానే మెగా అభిమానుల నుంచి అభ్యంతరం వ్యక్తం చేశారు. చిత్రంలో దొంగల గ్యాంగ్ కి లీడర్‌గా, ఓ గజ దొంగగా నాని నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. నానితో అయిదుగురు ఆడవాళ్లు ఆయన ముఠాలో ఉంటారని సమాచారం. చిత్రంలో దొంగతనం నేపథ్యంలో తెరకెక్కిన పలు సన్నివేశాలు కామెడీ పండిస్తాయని అంటున్నారు. విక్రమ్ టేకింగ్ చిత్రానికి హైలైట్ కానుందని తెలుస్తోంది.
పలు సూపర్ హిట్ సినిమాలు అందిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ నెగెటివ్ రోల్ లో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రంలో మేఘా ఆకాష్, ప్రియాంక అరుళ్ అనే ఇద్దరు భామలు నాని సరసన ఆడిపాడుతున్నారు. అనిరుద్ రవిచంద్రన్ బాణీలు కడుతున్నారు. చూడాలి మరి మంచి జోష్ లో ఉన్న నానికి ఈ సినిమా ఏ రేంజ్ హిట్ ఇస్తుందో.