‘గ్యాంగ్ లీడర్’ రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన చేసిన చిత్ర యూనిట్.. మిస్ అయ్యానన్న నాని
టాలీవుడ్ యంగ్ హీరో నేచురల్ స్టార్ నాని - క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'గ్యాంగ్ లీడర్'. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నానికి జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది. అలాగే 'ఆర్ఎస్ 100' హీరో కార్తికేయ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. వీరితో పాటు ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్, జైజా, సత్య తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమాను ఆగస్టు చివర్లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సాహో' ఇదే నెల 30న విడుదల కాబోతుండడంతో 'గ్యాంగ్ లీడర్'ను వాయిదా వేశారు. ఇదే విషయాన్ని చిత్ర నిర్మాతల్లో ఒకరైన నవీన్ యెర్నేని కూడా మీడియా ముందు చెప్పారు. అప్పటి నుంచి నాని సినిమా ఎప్పుడు విడుదలవుతుంది అన్నది చెప్పలేదు. ఈ క్రమంలోనే 'గ్యాంగ్ లీడర్' రిలీజ్ డేట్‌పై ఎన్నో రూమర్లు వచ్చాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే 'గ్యాంగ్ లీడర్' సెప్టెంబర్ 13న విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. దీన్ని హీరో నాని ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. 'అష్టా చమ్మా, భలే భలే మగాడివోయ్.. సెప్టెంబర్ నిన్ను మిస్ అయ్యాను. ఇప్పుడు మళ్లీ కుమ్మేద్దాం' అన్నట్లు క్యాప్షన్ కూడా పెట్టాడు. అన్నట్లు నాని హీరోగా నటించిన తొలి చిత్రం 'అష్టా చమ్మా' 2008 సెప్టెంబర్ 5న విడుదలైంది. దీనిని ఇంద్రగంటి మోహన్‌కృష్ణ తెరకెక్కించారు. అలాగే, మారుతి దర్శకత్వంలో వచ్చిన 'భలే భలే మగాడివోయ్' 2015 సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు చిత్రాలు ఘన విజయం సాధించాయి.
మరోవైపు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'వాల్మీకి'. పూజా హెగ్డే హీరోయిన్. తమిళ నటుడు అథర్వ మురళి ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. తమిళ చిత్రం 'జిగర్తాండ'కు ఇది రీమేక్. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ ఎల్ఎల్‌పీ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆయానకా బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా కూడా సెప్టెంబర్ 13నే ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











