twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కష్టాల్లో నాని సినిమా.. మార్చేయక తప్పేలా లేదట

    |

    హీరో నాని కొత్త సినిమా గ్యాంగ్ లీడర్‌కి కొత్త కష్టం వచ్చింది. మరికొద్ది రోజుల్లోనే సినిమా విడుదలకానున్న ఈ సమయంలో పేరు మార్చేయాల్సిన పరిస్థితి వచ్చిందట. ఉన్నట్టుండి ఈ పరిస్థితి రావడానికి కారణమేంటి? అంటే అదే పేరుతో రాబోతున్న మరో చిన్న సినిమా అని అంటున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది.

    గ్యాంగ్ లీడర్ మూవీ

    గ్యాంగ్ లీడర్ మూవీ

    నాని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ సినిమా తెరకెక్కుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో మేఘా ఆకాష్, ప్రియాంక అరుళ్ అనే ఇద్దరు భామలు నాని సరసన ఆడిపాడుతున్నారు. ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ నెగెటివ్ రోల్‌లో కనిపించనున్నడు. అనిరుద్ రవిచంద్రన్ బాణీలు కడుతున్నారు.

    ఐదుగురు ఆడ‌వాళ్ల చుట్టూ తిరిగే కథ

    ఐదుగురు ఆడ‌వాళ్ల చుట్టూ తిరిగే కథ

    గ్యాంగ్ లీడర్ సినిమాలో నాని పోషిస్తున్న పాత్ర చాలా విలక్షణమైంది. ఐదుగురు ఆడ‌వాళ్ల చుట్టూ తిరిగే కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని.. ఆడవాళ్ళ గ్యాంగ్‌కి బాస్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మరికొద్ది రోజుల్లోనే షూటింగ్ ఫినిష్ చేసుకోనుంది.

    సరిగ్గా ఈ సమయంలో ఝలక్

    సరిగ్గా ఈ సమయంలో ఝలక్

    కథకు తగ్గట్టుగా గ్యాంగ్ లీడర్ పేరు సూట్ అయిందని భావిస్తుండగా ఈ సినిమా టైటిల్ మార్చబోతున్నారనే వార్త నాని అభిమానులకు ఝలక్ ఇచ్చింది. ఆగస్టు 30 వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా కంటే వారం ముందే ఇదే పేరుతో మరో చిన్న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో నాని సినిమాకు పేరు మార్చేయాలని డిసైడ్ అయ్యారట మేకర్స్.

    చిరు బర్త్ డే కానుకగా ఫిక్స్ అయ్యారు.. అందుకే

    చిరు బర్త్ డే కానుకగా ఫిక్స్ అయ్యారు.. అందుకే

    నిజానికి గ్యాంగ్ లీడర్ పేరుతో ఓ చిన్న సినిమా తెరకెక్కుతోందని నాని యూనిట్ సభ్యులకు ముందే తెలుసు కానీ తమ సినిమానే ఫస్ట్ రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రాబ్లమ్ లేదు అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో ఆ చిన్న సినిమాను చిరు బర్త్ డే కానుకగా ఆగస్టు 22న రిలీజ్ చేస్తున్నాని ప్రకటించేశాడు ఆ చిత్ర దర్శకుడు. ఆ సినిమా డైరెక్టర్‌తో నాని యూనిట్ చర్చలు జరిపినా ఆయన చిరు ఫ్యాన్ కావడంతో తగ్గటం లేదట.

    క్లాష్ కాకూడదనే ఉద్దేశ్యంతో

    క్లాష్ కాకూడదనే ఉద్దేశ్యంతో

    రెండు పేర్లలో ఒకేసారి రెండు సినిమాలొస్తే చిత్ర ప్రమోషన్స్ దగ్గర్నుంచి మొదలుకొని ఆన్ లైన్ టికెట్స్ వరకు ప్రేక్షకులు తికమకపడే ప్రమాదముంది. ఇది గమనించిన నాని చిత్రయూనిట్ టైటిల్‌ మార్చేయడమే బెటర్ అని డిసైడ్ అయ్యారట. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానుందని అంటున్నారు.

    English summary
    After Jersey.. hero Nani's next movie is Gang Leader. The movie has fixed Release Date also. But as per latest news this movie title will be changed shortly.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X