క్రేజీ హీరోతో నాని నిర్మాణంలో మరో సినిమా.. ఫస్ట్‌లుక్ విడుదల
ట్రెండ్‌కి తగ్గట్టుగా సినిమాలతో పాటు అందుకు సంబంధించిన వ్యాపార కార్యకలాపాల్లో కూడా భాగమవుతున్నారు యంగ్ హీరోస్. ఈ మేరకు కొన్నాడు ప్రొడక్షన్ హౌస్ స్థాపిస్తుండగా, మరికొందరు థియేటర్స్ బిజినెస్ లాంటి వ్యాపారాల్లో అడుగులేస్తున్నారు. ఈ బాటలోనే ఇటీవలే నాచురల్ స్టార్ నాని సొంతంగా నిర్మాణ సంస్థ రేపాటు చేసిన సంగతి తెలిసిందే.
హీరోగా పలు వైవిధ్యమైన చిత్రాలతో వరుస విజయాలు అందుకుంటూనే స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు నాని. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసే క్రమంలో భాగంగా 'వాల్‌పోస్టర్ సినిమా' అనే బ్యానర్ స్టార్ట్ చేసి తొలి ప్రయత్నంలోనే అ! వంటి డిఫరెంట్ మూవీ తెలుగు ప్రేక్షకులకు అందించాడు. మొదటి సినిమాతోనే నిర్మాతగా సక్సెస్ టాక్ తెచ్చుకున్నాడు నాని.

మళ్ళీ ఇప్పుడు నాని సమర్పణలో వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌పై ఫలక్‌నుమాదాస్ ఫేమ్ విశ్వక్‌సేన్ హీరోగా కొత్త సినిమా రాబోతోంది. శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి త్రిపిర్‌నేని నిర్మిస్తోన్న ఈ చిత్రం పేరు హిట్. రుహానీ శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. క్రిస్మస్ సందర్భంగా చిత్ర ఫస్ట్‌లుక్ విడుదల చేశారు మేకర్స్.
ఈ ఫస్ట్‌లుక్‌లో విశ్వక్‌సేన్ స్టైలిష్‌గా కనపడుతున్నారు. సూపర్‌డెంట్ ఆఫ్ పోలీస్ విక్రమ్ రుద్రరాజు అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో విశ్వక్‌సేన్ ప్రేక్షకులను మెప్పించనున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1న హిట్ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేస్తున్నారు. మణికందన్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











