»   »  నాని ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ టీజర్

నాని ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ టీజర్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    హైదరాబాద్‌: నాని హీరోగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ'. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకరలు నిర్మిస్తున్నారు. నాని సరసన మెహరీన్‌ నటిస్తోంది. ఈ చిత్రం టీజర్ ని విడుదల చేసారు నిర్మాతలు.

    మరో ప్రక్క ఈ చిత్రం ఆడియోను జనవరి 18న విడుదల చేయనున్నట్లు నాని వెల్లడించారు. మొన్నీ మధ్య విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో పాటల్ని విడుదల చేయాలని భావించిన చిత్ర యూనిట్ జనవరి 18కి ముహూర్తం ఖరారు చేసేశారు.

    Nani's Krishnagaadi Veera Prema Gaadha - Teaser

    నాని ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ అభిమానిగా కనిపిస్తాడట. గతంలో ఈ సినిమాకు ‘జై బాలయ్య' అనే టైటిల్‌ వినిపించింది. అయితే ఈ టైటిల్ ఒక వర్గానికి చెందినదిగా ఉండటంతో 'కృష్ణ గాడి వీర ప్రేమ గాథ' గా మార్చారు. త్వరలోనే ఆడియో విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమాకు గానూ...నాని తన రెమ్యూనరేషన్ 4 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు చెప్పుకంటున్నారు సమాచారం. నిజమైతే...ఇదే ప్రస్తుతానికి నాని కెరీర్ లో ది బెస్ట్ రెమ్యూనరేషన్ అవుతుంది . ఈ సినిమా రోమాంటిక్ ఎంటర్ ట్రైనర్ గా రూపోందుతోంది.

    14 రీల్స్ పతాకంపై రూపొందుతోందుతున్న ఈ సినిమాకు అనిల్ సుంకర్ నిర్మాత. అనంతపుతం బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథ ఇది. ఈ సినిమాను ఫిబ్రవరి 5న విడుదల చేయాడానికి సిద్దం అవుతున్నారు. నాని నటించిన ‘భలే భలే మగాడివోయ్' చిత్రం మంచి విజయం సాధించిన నేపథ్యంలో ఆ తర్వాత వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

    నాని, మెహరీన్, సంపత్, మురళీశర్మ, బ్రహ్మాజీ, పృథ్వీ, శత్రు, హరీష్ ఉత్తమన్, బేబి నయన, మాస్టర్ ప్రతాప్, బేబి మోక్ష తదితరులు తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ఫైట్స్: విజయ్, డ్యాన్స్: రాజు సుందరం, ఎడిటర్: వర్మ, ఆర్ట్: అవినాష్ కొల్ల, లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, లిరిక్స్: కె.కె.(కృష్ణకాంత్), కో డెరక్టర్: సాయి దాసం, డైలాగ్స్: హను రాఘవపూడి, జయకృష్ణ, నిర్మాతలు: రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనిల్ సుంకర, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హను రాఘవపూడి.

    English summary
    Krishnagaadi Veera Prema Gaadha telugu movie official teaser released. The movie stars Nani, Brahmaji, Sampath Raj, Harish Uthaman, Murli Sharma, Sathru, Pruthvi, Prabhas Srinu, Venu Tillu among others. Directed by Hanu Raghavapudi. Produced by Raam Achanta, Gopi Achanta, Anil Sunkara under the banner 14 Reels. Music scored by Vishal Chandrashekhar.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more