Don't Miss!
- Sports DC vs RR: కొంపముంచిన మోహిత్ శర్మ.. రిషభ్ పంత్ విధ్వంసం!
- News కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నాని ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ టీజర్
హైదరాబాద్: నాని హీరోగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ'. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకరలు నిర్మిస్తున్నారు. నాని సరసన మెహరీన్ నటిస్తోంది. ఈ చిత్రం టీజర్ ని విడుదల చేసారు నిర్మాతలు.
మరో ప్రక్క ఈ చిత్రం ఆడియోను జనవరి 18న విడుదల చేయనున్నట్లు నాని వెల్లడించారు. మొన్నీ మధ్య విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో పాటల్ని విడుదల చేయాలని భావించిన చిత్ర యూనిట్ జనవరి 18కి ముహూర్తం ఖరారు చేసేశారు.
నాని ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ అభిమానిగా కనిపిస్తాడట. గతంలో ఈ సినిమాకు ‘జై బాలయ్య' అనే టైటిల్ వినిపించింది. అయితే ఈ టైటిల్ ఒక వర్గానికి చెందినదిగా ఉండటంతో 'కృష్ణ గాడి వీర ప్రేమ గాథ' గా మార్చారు. త్వరలోనే ఆడియో విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమాకు గానూ...నాని తన రెమ్యూనరేషన్ 4 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు చెప్పుకంటున్నారు సమాచారం. నిజమైతే...ఇదే ప్రస్తుతానికి నాని కెరీర్ లో ది బెస్ట్ రెమ్యూనరేషన్ అవుతుంది . ఈ సినిమా రోమాంటిక్ ఎంటర్ ట్రైనర్ గా రూపోందుతోంది.
14 రీల్స్ పతాకంపై రూపొందుతోందుతున్న ఈ సినిమాకు అనిల్ సుంకర్ నిర్మాత. అనంతపుతం బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథ ఇది. ఈ సినిమాను ఫిబ్రవరి 5న విడుదల చేయాడానికి సిద్దం అవుతున్నారు. నాని నటించిన ‘భలే భలే మగాడివోయ్' చిత్రం మంచి విజయం సాధించిన నేపథ్యంలో ఆ తర్వాత వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.
నాని, మెహరీన్, సంపత్, మురళీశర్మ, బ్రహ్మాజీ, పృథ్వీ, శత్రు, హరీష్ ఉత్తమన్, బేబి నయన, మాస్టర్ ప్రతాప్, బేబి మోక్ష తదితరులు తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ఫైట్స్: విజయ్, డ్యాన్స్: రాజు సుందరం, ఎడిటర్: వర్మ, ఆర్ట్: అవినాష్ కొల్ల, లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, లిరిక్స్: కె.కె.(కృష్ణకాంత్), కో డెరక్టర్: సాయి దాసం, డైలాగ్స్: హను రాఘవపూడి, జయకృష్ణ, నిర్మాతలు: రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనిల్ సుంకర, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హను రాఘవపూడి.