Don't Miss!
- News అహర్నిశలు ప్రజల మధ్యనే చంద్రబాబు.. చిరంజీవి; పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- Sports ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
వరుసగా 8 హిట్లు కొట్టిన నాని.... 9వ చిత్రం కూడా సిద్దమైంది, రిలీజ్ ఎప్పుడేంటే?
Recommended Video
తెలుగులో ఈ మధ్య కాలంలో మంచి సక్సెస్ రేటుతో మినిమమ్ గ్యారంటీ హీరోగా దూసుకెలుతున్నది ఎవరు అంటే అందరి నోటా ఒకేటే మాట వినిపిస్తుంది. అతడు మరెవరో కాదు నేచురల్ స్టార్ నాని. ఒకటి కాదు రెండు కాదు... నాని వరుసగా 8 విజయాలు అందుకున్నాడు. త్వరలో 9వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి త్రిబుల్ హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు.
ఎవడేతో... మొదలై వరుసగా
‘ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాతో మొదలైన నాని విజయాలు అందుకున్నారు. భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాధ, జెంటిల్మెన్, మజ్ను, నేను లోకల్, నిన్నుకోరి, ఇటీవల విడుదలైన ‘ఎంసీఏ' వరకు నాని విజయపరంపర కొనసాగుతూనే ఉంది.
వరుస విజయాలు, భారీ సంపాదన, సొంతగా నిర్మాణ రంగంలోకి
వరుస విజయాలు అందుకున్న హీరో నాని నిర్మాతకు మినిమమ్ గ్యారంటీ హీరోగా మారిపోయాడు. వరుస విజయాలతో వచ్చిన డబ్బుతో నాని సినీ నిర్మాణరంగంలోకి అడుగు పెట్టారు. వాల్ పోస్టర్ అనే ప్రొడక్షన్ సంస్థ స్థాపించి, ఇందులో నూతన దర్శకుడు ప్రశాంత్ వర్మతో కలిసి తొలి సినిమా స్టార్ట్ చేసాడు. ‘అ' అనే పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
విడుదలకు సిద్ధమైన నాని 9వ సినిమా
త్వరలో నాని తన 9వ సినిమా ‘కృష్ణార్జున యుద్ధం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఫ్రేం మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ మీర్ హీరోయిన్లు.
షూటింగ్ ఎక్కడి వరకు?
వెంకట్ బోయనపల్లి సమర్పణలో షైన్ స్క్రీన్న్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుంది. ఇందులో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.
రిలీజ్ డేట్ ఖరారు
అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 12న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీతాన్ని అందిస్తుండగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.