నాని ‘ఎంసీఏ-మిడిల్ క్లాస్ అబ్బాయి’ ఫస్ట్ లుక్

నాని హీరోగా తెరకెక్కుతున్న ‘ఎంసీఏ’(మిడిల్ క్లాస్ అబ్బాయి) ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.

By Bojja Kumar

Recommended Video

MCA Middle Class Abbai First Look నాని MCA ఫస్ట్ లుక్

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్ లో రూపొందుతోన్నసినిమా ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి'. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ దీపావళి సందర్భంగా విడుదల చేశారు.

నానికి జంట‌గా ఇటీవ‌ల ఫిదాతో తెలుగువారి మ‌న‌సుల్ని దోచుకున్న సాయిప‌ల్ల‌వి నటిస్తుంది. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. న‌వంబ‌ర్ మొద‌టి వారానికి రెండు సాంగ్స్ మిన‌హా మొత్త చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంది.

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ

``మా వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో ఈ ఏడాది రూపొందిన శ‌త‌మానంభ‌వ‌తి, నేను లోక‌ల్‌, డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్, ఫిదా, రాజా ధి గ్రేట్ చిత్రాల‌తో వ‌రుస‌గా ఐదు హిట్స్ సాధించాం. దీపావ‌ళి సంద‌ర్భంగా విడుద‌లైన `రాజా ది గ్రేట్‌` చిత్రంతో ఆరో హిట్ అందుకుంటామ‌ని కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఇప్పుడు నాని హీరోగా నిర్మిత‌మ‌వుతోన్న చిత్రం `ఎంసిఏ`. ఈ ఏడాది `నేను లోక‌ల్‌` సినిమా విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్‌డూప‌ర్‌హిట్ సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మా హిట్ కాంబినేష‌న్ మ‌రోసారి పున‌రావృత్తం అవుతుంది... అన్నారు.

సెకండ్ హ్యాట్రిక్ మూవీ అవుతుంది.

సెకండ్ హ్యాట్రిక్ మూవీ అవుతుంది.

శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న `ఎంసిఎ` చిత్రం మా బ్యాన‌ర్‌లో మ‌రో హిట్ చిత్రంగా నిలవ‌డ‌మే కాకుండా మా బ్యాన‌ర్‌లో సెకండ్ హ్యాట్రిక్ మూవీ అవుతుంది. అద్భుత‌మైన క‌థ‌, అన్నీ స‌మ‌పాళ్ళ‌లోన ఎలిమెంట్స్‌తో ఈ చిత్రంలో నానిని ద‌ర్శ‌కుడు వేణు స‌రికొత్త స్ట‌యిల్లో చూపించ‌నున్నారు. విజ‌యాలు సాధిస్తున్న నానికి ఈ `ఎంసీఏ` చిత్రం మ‌రో మెట్టుకానుంది. మా బ్యాన‌ర్లో సెన్సేష‌న‌ల్ హిట్ అయిన మూవీ ఫిదాలో న‌టించిన సాయిప‌ల్ల‌వి నానికి జోడిగా న‌టిస్తుండ‌గా, ప్ర‌ముఖ హీరోయిన్ భూమిక ఇందులో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుంది. త‌ప్ప‌కుండా సినిమా అంద‌రినీ ఆక‌ట్టుకోవ‌డ‌మే కాదు, ప్రేక్ష‌కుల్లో మా బ్యాన‌ర్ వాల్యూను పెంచే చిత్ర‌మ‌వుతుంది భావిస్తున్నాను... అని దిల్ రాజు అన్నారు.

క్రిస్ మస్ కానుకగా విడుదల

క్రిస్ మస్ కానుకగా విడుదల

నేను లోక‌ల్ చిత్రానికి ఎక్స్‌ట్రార్డిన‌రీ మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. న‌వంబ‌ర్ మొద‌టివారానికి రెండుపాటలు మిన‌హా సినిమా మొత్తం షూటింగ్‌ను పూర్తి చేస్తాం. అలాగే ఈ సినిమాను క్రిస్మ‌స్ కానుక‌గా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.

నటీనటులు, టెక్నీషియన్స్

నటీనటులు, టెక్నీషియన్స్

నాని, సాయిప‌ల్ల‌వి, భూమిక‌, విజ‌య్‌, సీనియ‌ర్ న‌రేష్‌, ఆమ‌ని త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి డైలాగ్స్ః మామిడాల తిరుప‌తి, శ్రీకాంత్ విస్సా, ఆర్ట్ డైరెక్ట‌ర్ః రామాంజ‌నేయులు, మ్యూజిక్ః దేవిశ్రీ ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీః స‌మీర్‌రెడ్డి, నిర్మాణంః రాజు - శిరీష్ - లక్ష్మణ్, క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః శ్రీరామ్ వేణు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X