twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శుక్రవారం రిలీజ్..శనివారం సక్సెస్ మీట్

    By Srikanya
    |

    శ్రీశైలేంద్ర సినిమా పతాకంపై నాని, హరిప్రియ, బిందుమాధవి జంటగా ఎస్.ఎస్.బుజ్జిబాబు నిర్మించిన 'పిల్ల జమిందార్' చిత్రం ఈ శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే.అశోక్‌రెడ్డి దర్శకత్వం వహించిన ఈ ఈ చిత్రానికి డి.ఎస్.రావు సమర్పకుడు. శనివారం ప్రసాద్ ల్యాబ్‌లో ఈ చిత్రం సక్సెస్ మీట్‌ ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో డి.ఎస్.రావు మాట్లాడుతూ "ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేశాం. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి సినిమా బాగుందని రెస్పాన్స్ వస్తోంది. నాని నాకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ 'పిల్ల జమిందార్'. ఇలాంటి హిట్‌కోసం పదేళ్ళ నుంచి ఎదురు చూస్తున్నా. దర్శకుడు అశోక్‌రెడ్డి మొదట ఎలా కథ చెప్పారో అలాగే స్క్రీన్ మీద కూడా చూపించారు. మంచి భవిష్యత్తున్న దర్శకుడు ఆయన. సెల్వ గణేష్ అందించిన మ్యూజిక్ సినిమాకి పెద్ద ఎస్సెట్. ఈ చిత్రంతో నాని పెద్ద హీరో అయ్యారు '' అన్నారు. హీరో నాని మాట్లాడుతూ "ఈ సినిమాని మళ్ళీ మళ్లీ చూడాలనిపిస్తోంది. ఈ చిత్రానికి వచ్చిన స్పందన చూసి చాలా హ్యాపీగా ఉంది. చాలా మంది ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో 'పిల్ల జమిందార్' పట్ల ఇస్తున్న స్టేట్‌మెంట్లు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి. సినిమాకు మౌత్ పబ్లిసిటీ కూడా ఎంతో ముఖ్యం. ఈ సినిమాకు ఇది చాలా ఉపయోగపడుతోంది'' అన్నారు. హీరోయిన్ హరిప్రియ మాట్లాడుతూ 'ఈ చిత్రంలో నా క్యారెక్టర్‌కి మంచి ఆదరణ లభిస్తోంది. నాకు ఇంత బాగా సపోర్ట్ ఇచ్చిన నిర్మాతకు, హీరో నానికి థ్యాంక్స్. రెస్పాన్'' అన్నారు.

    English summary
    Nani, Hari priya, Bindhu Madhavi starred 'pilla zamindar movie released on Oct 14. This film directed by Ashok and directed by D S Rao, S S Buchibabu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X