హీరో నాని ‘జెండాపై కపిరాజు’... దాసరి క్లాప్

By Bojja Kumar

హైదరాబాద్: నాని, అమలపాల్ హీరో హీరోయిన్లుగా పి. సముద్ర‌ఖని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'జెండాపై కపిరాజు'. వాసన్స్ విజువల్ వెంచర్స్ సమర్పణలో కె.ఎస్. శ్రీనివాసన్ నిర్మిస్తున్న ఈచిత్రం ప్రారంభోత్సవం ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. దర్శక రత్న దాసరి నారాయణరావు తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టి గౌరవ దర్శకత్వం వహించగా....ఆర్.బి. చౌదరి కెమెరా స్విచాన్ చేశారు. ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, సి కళ్యాణ్, ఆర్.బి. చౌదరి, కెఎస్. రామారావు, జెమిని కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ...ప్రతి రోజు మన చుట్టూ జరిగే సమస్యలను ప్రస్తావిస్తూ ఈచిత్రం ఉంటుంది, మనల్ని సరిదిద్దుకుంటే ప్రపంచం అంతా సరిదిద్దుకుంటుంది అనే కాన్సెప్టుతో ఈచిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఒక మంచి సందేశాత్మక చిత్రంగా ఈమూవీ ఉంటుందన్నారు.

హీరో నాని మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా ఈ చిత్రంలో తన క్యారెక్టర్ ఛాలెంజింగ్‌గా ఉంటుందని, చెడు మీద సాగించే యుద్దమే ఈచిత్రం..అందుకే 'జెండాపై కపిరాజు' అనే టైటిల్ పెట్టినట్లు తెలిపారు. నిర్మాత కె.ఎస్ శ్రీనివాసన్ మాట్లాడుతూ మొదట గోవాలో పాటల చిత్రీకరణ జరిపి సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో హైదరాబాద్, వైజాగ్ లలో ఫుల్ షెడ్యూల్స్ జరుగుతాయి అని వెల్లడించారు.

ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెల కంటి, ఫోటోగ్రఫీ: ఎన్. సుకుమార్, సంగీతం: జి.వి.ప్రకాష్, లిరిక్స్: అనంత శ్రీరామ్, ఆర్ట్: జాకీ, ఎడిటింగ్: ఎస్.ఎస్. ఫాజిల్, నిర్మాత కె.ఎస్. శ్రీనివాసన్, దర్శకత్వం: పి. సముద్రఖని.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X