నెగెటివ్ క్లైమాక్స్? నాని చనిపోతే ప్రేక్షకులు తట్టుకోగలరా?
Recommended Video

నాని హీరోగా రూపొందుతున్న చిత్రం 'జెర్సీ'. మళ్ళిరావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాపు రూపొందుతున్న ఈ మూవీలో నాని క్రికెటర్ పాత్రలో అలరించబోతున్నారు. ఏప్రిల్ 19న దీన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఓ వైపు ఐపీఎల్ ఫీవర్ నడుస్తుండటం, యూత్ మొత్తం క్రికెట్ మూడ్లో ఉండటంతో 'జెర్సీ' చిత్రానికి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ నెగెటివ్ క్లైమాక్స్ ప్రేక్షకులు షాకయ్యేలా ఉంటుందట.

ఆ క్రికెటర్ జీవితం ఆధారంగా
‘జెర్సీ' మూవీ ఇండియన్ క్రికెటర్ రమన్ లంబా జీవితం ఆధారంగా తెరకెక్కుతోందని తెలుస్తోంది. రమన్ లంబా క్రికెట్ ఆడుతుండగా బాల్ తగిలి తన 38 ఏళ్ల వయసులో ప్రాణాలు కోల్పోయాడు. ‘జెర్సీ' మూవీ ఎడింగ్ కూడా ఇలాగే ఉంటుందట.

ప్రేక్షకులు తట్టుకోగలరా?
హీరో చనిపోయే నెగెటివ్ క్లైమాక్స్ తెలుగులో అంతగా వర్కౌట్ కావు. కానీ రియలిస్టిక్‌గా ఉండాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి... చివర్లో నాని పాత్రను చంపేశాడని టాక్. అదే నిజమైతే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

నాని కూడా ఒప్పుకున్నాడా
రోటీన్‌కు భిన్నంగా, రియలిస్టిక్ కథలు చేయడానికి ఇష్టపడే నాని... నెగెటివ్ క్లైమాక్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ‘జెర్సీ' చిత్రం నాని కెరీర్లోనే ఎప్పటికీ గుర్తుండిపోయే మెమొరబుల్ చిత్రంగకాబోతోందని అంటున్నారు.

జెర్సీ
నాని, శ్రద్ధ శ్రీనాధ్, సత్యరాజ్, రోనిత్ కమ్ర, రావు రమేష్, బ్రహ్మాజీ, శిశిర్ శర్మ, సంపత్, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచందర్, కెమెరా: సాను జాన్ వరుఘీస్ , ఆర్ట్: అవినాష్ కొల్ల, ఎడిటర్: నవీన్ నూలి, ఎగ్జి క్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకట్ రత్నం (వెంకట్), సమర్పణ: పి.డి.వి.ప్రసాద్, నిర్మాత: సూర్యదేవర నాగ వంశి, కధ-స్క్రీన్ ప్లే- మాటలు-దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి


Click it and Unblock the Notifications











