నోస్టాల్జిక్ టైటిల్‌తో నానీ సినిమా: టైటిల్ చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు
ఒకదాని వెనుక ఒకటి విభిన్నమైన కథలతో తన స్టైల్ మార్క్ తో టాలీవుడ్ లో ఎక్కువ వరుసహిట్లు ఇచ్చిన హీరోగా నానీ ఇప్పుడు చిన్న నిర్మాతల పాలిటి పెద్ద హీరో అయిపోయాడు. కథల ఎంపికలో చాలా జాగ్రత్త వహించే నాని
ఒకటీ.., రెండూ.., మూడూ.., ఇక లెక్కపెట్టటం కూడా అనవసరం అన్న రేజిలో వరుసగా హిట్లతో దూసుకు పోతున్నాడు నాని. అంతేకాదు ఏ సినిమాకీ ఎక్కువ టైం వేస్ట్ చేయటం లేదు, ఎక్కువ గ్యాప్ తీసుకోవటం లేదు. ఒకదాని వెనుక ఒకటి విభిన్నమైన కథలతో తన స్టైల్ మార్క్ తో టాలీవుడ్ లో ఎక్కువ వరుసహిట్లు ఇచ్చిన హీరోగా నానీ ఇప్పుడు చిన్న నిర్మాతల పాలిటి పెద్ద హీరో అయిపోయాడు.

డిసెంబర్ లో మూడో సినిమా
ఆల్రెడీ ఈ ఏడాది రెండు సినిమాల్ని రిలీజ్ చేసిన నాని డిసెంబర్ లో మూడో సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. నాని రీసెంట్ మూవీ అయిన "ఎంసీఏ" డిసెంబర్ లో రిలీజ్ అవ్వనుందట. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే ఈ మూవీతో పాటు "కృష్ణార్జున యుద్ధం" అనే ఇంకో సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు నాని.

తర్వాతి సినిమాకు గ్రీన్ సిగ్నల్
ఇప్పుడు రాబోతున్న ఎంసీఏ పై కూడా ప్రేక్షకులకు భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. అంతే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన తర్వాతి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని టాలీవుడ్ టాక్. అందులోనూ ఆ చిత్రానికి ఓ వెరైటీ టైటిల్ ను ఫిక్స్ చేశారని వినికిడి. కథల ఎంపికలో చాలా జాగ్రత్త వహించే నాని తన తరుపరి చిత్రం కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేయనున్నాడు.

చిత్రలహరి
ఈ సినిమాకి 'చిత్రలహరి' అనే టైటిల్ దాదాపుగా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. దూరదర్శన్ చానెల్ లో ప్రసారం అయిన చిత్రలహరి కార్యక్రమం బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. దీంతో, జనాలకు ఆ టైటిల్ బాగా క్యాచీగా ఉంటుందని భావిస్తున్నారట. నాని తన సినిమాలక కథల విషయంలోనే కాకుండా, టైటిల్స్ విషయంలో కూడా సెలక్టివ్ గా ఉంటున్నాడట.

జనవరి లేదా ఫిబ్రవరి
వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని టాక్ వినిపిస్తోంది. సమ్మర్ రేసులో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందట. రామ్, లావణ్య త్రిపాఠి జంటగా కిషోర్ తిరుమల తెరకెక్కించిన చిత్రం 'ఉన్నది ఒకటే జిందగీ' త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. దాని తర్వాత వచ్చే సినిమా నాని దే కావటం తో ఆ సినిమా కూడా మంచి హిట్ అవుతుందన్న నమ్మకం తోనే ఉన్నారట నిర్మాతలు.


Click it and Unblock the Notifications











