కృష్ణ వంశీ,నాని చిత్రం ‘పైసా’ ఫస్ట్ లుక్
ఇక ఈ చిత్రం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌ను టార్గెట్ చేస్తూ రూపొందిస్తున్నారనే వార్తలు ఆ మధ్య గుప్పుమన్నాయి. ఈవార్తలపై దర్శకుడు కృష్ణ వంశీ స్పందించారు. ఈచిత్రం జగన్‌కు వ్యతిరేకం ఏమాత్రం కాదని, ఎవరిని ఉద్దేశించి ఈచిత్రం తీయడం లేదని స్పష్టం చేశారు. రాజకీయాల నేపథ్యంలోనే సినిమా ఉంటుందని, యంగ్ పొలిటిషీయన్ గా హీరో పాత్ర ఆదర్శ వంతంగా ఉంటుందని చెప్పుకొచ్చారు
ఎల్లోఫ్లవర్స్ సంస్థ ఈ చిత్రాన్ని మంచి నిర్మాణ విలువలతో నిర్మిస్తోంది. ఈ సినిమాలో కేథరీన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో చిత్రీకరణ సాగుతోంది. గతంలో మిరపకాయ నిర్మించిన రమేష్ పుప్పాల నిర్మాత. ఇక గోపీచంద్ మొగుడు తర్వాత కృష్ణవంశీ చేస్తున్న చిత్రం ఇదే. ఆ చిత్రం డిజాస్టర్ కావటంతో కొంత గ్యాప్ తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మొదట ఈ చిత్రానికి పైసాలో పరమాత్మ టైటిల్ అనుకున్నారు. ఆ తర్వాత జెండాపై కపిరాజు అని వార్తలు వచ్చాయ. అయితే పైసాలో పరమాత్మ టైటిల్ వేరే వారు తమ సినిమాకు పెట్టుకుని ఉండటంతో పైసా టైటిల్ ని ఈ చిత్రానికి ఫిక్స్ చేసారు.
ఈ చిత్రం తన పాత్ర డిఫెరెంట్ గా ఉంటుందని నాని చెప్తూ...కృష్ణవంశీ దర్శకత్వంలో చేస్తున్న 'పైసా' నాకు పూర్తి స్థాయి వృత్తి సంతృప్తినిచ్చింది. పాతబస్తీలో ఓ షేర్వాణీ షాపు మోడల్‌గా ఇందులో కనిపిస్తా. ఇందులో సరికొత్త నానీని చూస్తారు అన్నారు. అదే విధంగా కాస్టూమ్స్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. నాని కాస్ట్యూమ్స్ కోసం స్వారోవ్‌స్కి క్రిస్టల్స్ వాడుతున్నారట. ఓక్కో సూట్ కోసం దాదాపు 20 వేల క్రిస్టల్స్ వాడుతున్నారు. వీటితో తయారు చేసే ఒక్కో సూట్ కు రూ. 7.5 లక్షల వరకు ఖర్చవుతుందట. ఇప్పటి వరకు ఇండియాలో ఏ హీరో కూడా ఇలాంటి సూట్ తో పెర్ఫార్మ్ చేయలేదట. ఇంతకీ వీటికున్న ప్రత్యేకత ఏమిటంటే....మైఖేల్ జాక్సన్ ఇలాంటి క్రిస్టల్స్ తో చేసిన కాస్ట్యూమ్స్ వాడేవారని యూనిట్ సభ్యులు అంటున్నారు.


Click it and Unblock the Notifications












