Shyam Singha Roy మూవీకి రెండు షాక్‌లు: రిలీజ్ రోజే లీకైన ఫుల్ మూవీ.. అక్కడ సినిమా ప్రదర్శనకు బ్రేక్

తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేసే హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకడు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా ప్రాజెక్టులను పట్టాలెక్కించే అతడు.. కొంత కాలంగా థియేటర్లలో సినిమాలను విడుదల చేయలేకపోతున్నాడు. దీంతో అతడి అభిమానులు నిరాశగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా బిగ్ స్క్రీన్‌పై అలరించాలన్న ఉద్దేశ్యంతో తాజాగా అతడు 'శ్యామ్ సింగ రాయ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాలతో వస్తున్న దీనికి అన్ని వర్గాల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా నాని 'శ్యామ్ సింగ రాయ్' మూవీ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం అయింది. ఆ వివరాలు మీకోసం!

శ్యామ్ సింగ రాయ్‌గా ఎంటరైన నాని

శ్యామ్ సింగ రాయ్‌గా ఎంటరైన నాని

బ్యాగ్రౌండ్ లేకపోయినా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం 'శ్యామ్ సింగ రాయ్' అనే సినిమాలో నటించాడు. రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన ఈ సినిమాను వెంకట్ బోయినపల్లి దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చాడు.

నాని కెరీర్‌లోనే రికార్డు స్థాయి రిలీజ్

నాని కెరీర్‌లోనే రికార్డు స్థాయి రిలీజ్

నానికి తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ మంచిగానే ఉంది. అందుకే 'శ్యామ్ సింగ రాయ్' మూవీ హక్కులకు పోటీ ఏర్పడింది. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మంచి బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే, చాలా చోట్ల ఈ సినిమాను నిర్మాతలే విడుదల చేస్తున్నారు. ఇక, ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నాలుగు భాషల్లో కలిపి 1000కి పైగానే థియేటర్లలో విడుదల అవుతోంది.

మంచి టాక్.. పాజిటివ్ రివ్యూలతోనే

మంచి టాక్.. పాజిటివ్ రివ్యూలతోనే

క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దాదాపు అన్ని ఏరియాల్లోనూ ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. దీంతో థియేటర్లు మొత్తం కళకళలాడిపోయాయి. ఇక, ఈ సినిమాలో నాని వన్ మ్యాన్ షోతో అలరించాడని అంటున్నారు. దీనికితోడు పాజిటివ్ రివ్యూలు కూడా వచ్చాయి. దీంతో మంచి టాక్ దక్కింది.

నాని కెరీర్‌లోనే మంచి ఓపెనింగ్స్

నాని కెరీర్‌లోనే మంచి ఓపెనింగ్స్

'శ్యామ్ సింగ రాయ్' రిలీజ్‌కు ముందే భారీ అంచనాలను ఏర్పరచుకుంది. ఇది నాలుగు భాషల్లో తెరకెక్కడంతో అన్ని చోట్లా భారీ స్థాయిలో విడుదలైంది. దీంతో ఈ సినిమాను మొదటి రోజు మంచి కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో నాని కెరీర్‌లో ఎన్నో రికార్డులు కూడా నమోదవబోతున్నాయి. ఇక, ఓవర్సీస్‌లో ప్రీమియర్ల ద్వారానే ఈ చిత్రం మంచి నెంబర్స్ రాబట్టింది.

శ్యామ్ సింగ రాయ్‌కు రెండు షాక్‌లు

శ్యామ్ సింగ రాయ్‌కు రెండు షాక్‌లు

ఎన్నో అంచనాలతో 'శ్యామ్ సింగ రాయ్' మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం విడుదల సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా థియేటర్లు తెలుగు వాళ్లతో కళకళలాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న టికెట్ ధరల వివాదంతో చాలా థియేటర్లు మూతపడ్డాయి. దీనికితోడు ఈ చిత్రానికి మరో బిగ్ షాక్ కూడా తగిలింది.

ఆన్‌లైన్‌లో శ్యామ్ సింగ రాయ్ మూవీ

ఆన్‌లైన్‌లో శ్యామ్ సింగ రాయ్ మూవీ

సుదీర్ఘ కాలంగా పైరసీని ప్రోత్సహిస్తోన్న తమిళ్ రాకర్స్, మూవీ రూల్జ్ వంటి సంస్థలు ఎన్నో చిత్రాలను ఆన్‌లైన్‌లో పెట్టేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా 'శ్యామ్ సింగ రాయ్' మూవీని కూడా లీక్ చేసేశాయి. ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొన్ని గంటల్లోనే డౌన్‌లోడ్ లింక్‌ను కూడా పెట్టేశాయి. దీని ప్రభావం మూవీ కలెక్షన్లపై తీవ్ర స్థాయిలో చూపించే ప్రమాదం కూడా ఉండనుంది.

రిపోర్టు చేస్తున్నా.. మరింత ఎక్కువ

రిపోర్టు చేస్తున్నా.. మరింత ఎక్కువ

ఈ మధ్య కాలంలో పైరసీ భూతం మరింత ఎక్కువ అయింది. దీంతో చాలా మంది ఈ సైట్లపై రిపోర్టులు చేస్తున్నారు. దీంతో కొన్ని యూఆర్‌ఎల్‌ను క్రియేట్ చేసి మరీ సైట్లను నడుపుతున్నారు. అలాగే, వీటి కోసమే కొన్ని ప్రత్యేకమైన యాప్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. దీంతో పెద్ద సినిమాలతో పాటు చిన్న చిత్రాలకు కూడా ఇవి గుదిబండలా మారుతోన్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X