Shyam Singha Roy Twitter Review: నాని సినిమాకు అలాంటి టాక్.. అదొక్కటే మైనస్.. మొత్తంగా ఎలా ఉందంటే!

బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే తనదైన శైలి సహజ సిద్ధమైన నటనతో నేచురల్ స్టార్‌గా ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో నాని. కెరీర్ ఆరంభం నుంచే ఎన్నో విజయాలను అందుకుంటూ వచ్చిన అతడు.. స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని అతడు.. ప్రతి సినిమాలోనూ సహజ సిద్ధమైన నటనను కనబరిచే అతడు.. అన్నింటినీ వన్ మ్యాన్ షోలుగా మార్చుకున్నాడు. తద్వారా మంచి నటుడిగా పేరు తెచ్చుకోవడంతో పాటు ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'శ్యామ్ సింగ రాయ్'గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ట్విట్టర్ రివ్యూపై లుక్కేద్దాం పదండి!

శ్యామ్ సింగ రాయ్‌గా వచ్చిన నాని

శ్యామ్ సింగ రాయ్‌గా వచ్చిన నాని

దాదాపు రెండేళ్లుగా థియేటర్లలో సందడి చేయని నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం 'శ్యామ్ సింగ రాయ్' అనే సినిమాలో నటించాడు. రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన ఈ సినిమాను వెంకట్ బోయినపల్లి దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు.

అంచనాలు పెంచేసిన అప్‌డేట్స్

అంచనాలు పెంచేసిన అప్‌డేట్స్

విభిన్నమైన కథతో వచ్చిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. అందుకే ఈ చిత్రం నుంచి ఏది విడుదలైన మంచి రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు రికార్డు వ్యూస్ వచ్చాయి. అలాగే, పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా దక్షిణాదిలో అందరి దృష్టిని ఆకర్షించింది.

బిజినెస్ కూడా భారీగా... గ్రాండ్‌గా

బిజినెస్ కూడా భారీగా... గ్రాండ్‌గా

నానికి తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ మంచిగానే ఉంది. అందుకే 'శ్యామ్ సింగ రాయ్' మూవీ హక్కులకు పోటీ ఏర్పడింది. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మంచి బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే, చాలా చోట్ల ఈ సినిమాను నిర్మాతలే విడుదల చేస్తున్నారు. ఇక, ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నాలుగు భాషల్లో కలిపి 1000కి పైగానే థియేటర్లలో విడుదల అవుతోంది.

నాని సినిమాకు పాజిటివ్ టాక్‌నే

నాని సినిమాకు పాజిటివ్ టాక్‌నే

విలక్షణమైన కథతో రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీకి సంబంధించిన ప్రీమియర్ షోలు ఇప్పటికే పూర్తయ్యాయి. నాని నటించిన ఈ సినిమాకు ఆరంభం నుంచే పాజిటివ్ టాక్ వచ్చినట్లు ఇప్పటి వరకూ వచ్చిన ట్వీట్లను బట్టి అర్థం అవుతోంది. సినిమాపై చేసిన మెజారిటీ ట్వీట్లు దీనికి అనుకూలంగానే ఉండడంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీ అవుతోంది.

ఫస్టాఫ్ ఇలా.. సెకెండ్ హాఫ్ అలా

ఫస్టాఫ్ ఇలా.. సెకెండ్ హాఫ్ అలా

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీకి ఇప్పటి వరకూ వచ్చిన ట్వీట్ల ప్రకారం.. ఫస్టాఫ్ అంతా ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకుడిని చిన్నగా కథలోకి తీసుకెళ్లేలా ఉందట. ఇంటర్వెల్‌కు ముందు శ్యామ్ సింగ రాయ్ ఎంట్రీ అదిరిపోతుందని తెలిసింది. ఇక, సెకెండాఫ్ అంతా నాని, సాయి పల్లవి అదరగొట్టేశారట. క్లైమాక్స్ కూడా సూపర్‌గా ఉందని అంటున్నారు.

సినిమా ప్లస్‌లు... మైనస్‌లు ఇవే

సినిమా ప్లస్‌లు... మైనస్‌లు ఇవే

'శ్యామ్ సింగ రాయ్' మూవీని చూసిన వాళ్లంతా ఇచ్చిన రిపోర్టుల ప్రకారం.. ఇందులో నాని, సాయి పల్లవి నటన, ఎమోషనల్ సన్నివేశాలు, బ్యాగ్రౌండ్ స్కోర్, దర్శకుడు ఎంచుకున్న కథ, స్క్రీన్‌ప్లే, సెకెండాఫ్ అంచనాలకు అనుగుణంగా ఉండడం దీనికి ప్లస్ అని చెబుతున్నారు. అయితే, కథ నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపించడం ఒక్కటే సినిమాకు మైనస్‌ అని అంటున్నారు.

Recommended Video

Daare Leda Team interview part 2 | Hero Nani Praises Actor Satyadev
మొత్తంగా ఈ సినిమా ఎలా ఉంది

మొత్తంగా ఈ సినిమా ఎలా ఉంది

ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. నాని నటించిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీ పూర్తిగా సరికొత్త కథతో సాగే ఎమోషనల్ డ్రామా అని తెలుస్తోంది. కమర్షియల్ అంశాలకు దూరంగా ఉన్నా ప్రేక్షకులను కట్టిపడేసే స్టోరీలైన్‌తో అద్భుతంగా సాగుతుందని అంటున్నారు. మొత్తంగా ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమా అని ఇప్పటి వరకూ చూసిన వాళ్లంతా చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X