Tuck Jagadish: మళ్లీ మారిన ‘టక్ జగదీష్’ స్ట్రీమింగ్ డేట్.. సర్‌ప్రైజ్ చేస్తూ ముందుగానే రిలీజ్

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. కానీ, వారిలో కొందరు మాత్రమే బ్యాగ్రౌండ్ లేకుండానే వచ్చి స్టార్లుగా ఎదుగుతున్నారు. అలాంటి వారిలో నేచురల్ స్టార్ నాని ఒకడు. సహజ సిద్ధమైన నటనతో ప్రతి సినిమానూ వన్ మ్యాన్ షోగా మార్చుకునే ఈ హీరో.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను అందుకున్నాడు. అయితే, 'జెర్సీ' తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం చాలా కాలంగా వేచి చూస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం నాని 'టక్ జగదీష్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ మళ్లీ మారినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఇది ఎప్పుడు రాబోతుంది? ఆ వివరాలు మీ అందరి కోసం!

‘టక్ జగదీష్’గా సిద్ధంగా ఉన్న నాని

‘టక్ జగదీష్’గా సిద్ధంగా ఉన్న నాని

నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రమే 'టక్ జగదీష్'. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఇందులో టాలెంటెడ్ హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ నటిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. దీన్ని షైస్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, పెద్ది హరీష్ నిర్మిస్తున్నారు. నాజర్, జగపతిబాబు, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

వాటితో సినిమాపై భారీ అంచనాలు

వాటితో సినిమాపై భారీ అంచనాలు

సుదీర్ఘ కాలంగా నాని సినిమాలు ప్రేమ కథలతోనో, కుటుంబ కథలతోనో తెరకెక్కుతాయి. అతడిని మాస్ బ్యాగ్రౌండ్‌తో పెద్దగా చూసిన సందర్భాలు మాత్రం లేవనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో 'టక్ జగదీష్' సినిమా నుంచి వచ్చిన టీజర్, పోస్టర్లలో ఏకంగా కత్తి పట్టుకుని కనిపించాడు. దీంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఫలితంగా దీనిపై ఆసక్తి కూడా పెరిగిపోయింది.

షూటింగ్ కంప్లీట్.. వరుసగా బ్రేక్‌లు

షూటింగ్ కంప్లీట్.. వరుసగా బ్రేక్‌లు

గతంలో నానితో 'నిన్ను కోరి' వంటి సూపర్ హిట్ తీసిన శివ నిర్వాణ ఇప్పుడు 'టక్ జగదీష్' అనే సినిమాను తెరకెక్కించాడు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. అనివార్య కారణాలతో ప్రేక్షకుల ముందుకు మాత్రం రాలేదు. దీన్ని గత సమ్మర్‌లోనే విడుదల చేస్తున్నట్లు ప్రకటించినా.. కోవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా అది సాధ్య పడలేదు. దీంతో ఇది పలుమార్లు వాయిదా పడింది.

ఓటీటీలో రిలీజ్.. టాలీవుడ్‌లో రచ్చ

ఓటీటీలో రిలీజ్.. టాలీవుడ్‌లో రచ్చ

నాని నటించిన 'టక్ జగదీష్' మూవీని అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదల చేస్తున్నారు. ఈ విషయం కొద్ది రోజుల క్రితం 'లవ్ స్టోరీ' నిర్మాతల ప్రెస్‌మీట్‌తో ఇది కాస్తా బయటకు వచ్చింది. అదే సమయంలో పెద్ద రచ్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో 'టక్ జగదీష్' నిర్మాతలు తమ సినిమా ఎదుర్కొన్న పరిస్థితులను వివరిస్తూ లేఖను కూడా విడుదల చేయడంతో వివాదం ముగిసింది.

ఆరోజు నుంచే అమెజాన్‌లో స్ట్రీమింగ్

ఆరోజు నుంచే అమెజాన్‌లో స్ట్రీమింగ్

ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోన్న దాని ప్రకారం.. 'టక్ జగదీష్' చిత్రాన్ని సెప్టెంబర్ 10 నుంచి అమెజాన్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే వెల్లడించింది. అంతేకాదు, ఇందులో 'భూదేవిపురం చిన్న కొడుకు, నాయుడి గారి అబ్బాయి టక్ జగదీష్ చెబుతున్నాడు.. మొదలెట్టండి' అనే డైలాగ్‌ను కూడా చూపించారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

మళ్లీ మారిన టక్ జగదీష్ రిలీజ్ డేట్

మళ్లీ మారిన టక్ జగదీష్ రిలీజ్ డేట్

'టక్ జగదీష్' మూవీ స్ట్రీమింగ్ వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10 కానుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. దీన్ని ఒకరోజు ముందుగానే అంటే సెప్టెంబర్ 9న విడుదల చేయబోతున్నారట. ఆరోజు రాత్రి 10 గంటల నుంచే నాని సినిమా అమెజాన్‌లో స్ట్రీమింగ్ కానుందని తెలిసింది. దీనికి సంబంధించిన ప్రకటన ఈ రెండు రోజుల్లో రానుందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X