Tuck Jagadish in Amazon.. నేచురాల్ స్టార్ నాని మనస్తాపం.. రిలీజ్ ఎప్పుడంటే!
టాలీవుడ్‌లో కొద్ది రోజులుగా కొనసాగుతున్న రూమర్లు, ఊహాగానాలు, గాసిప్స్ బలం చేకూరేలా అన్నంత పని జరిగిపోయింది. థియేటర్లలో రిలీజ్ చేయాలని పట్టుబడ్డిన నాని ప్రయత్నం సఫలం కాలేదు. చివరకు టక్ జగదీష్ ఓటీటీలో రిలీజ్‌కు సిద్దమైంది. దీంతో నేచురల్ స్టార్ నాని, సంగీత దర్శకుడు తమన్ మనస్తాపానికి గురయ్యారనే వార్త మీడియాలో వైరల్ అవుతున్నది. అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోతో టక్ జగదీష్ నిర్మాతలకు భారీ డీల్ జరగడంతో చిత్రాన్ని త్వరలోనే ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. టక్ జగదీష్ ఓటీటీకి వెళ్లడానికి కారణం ఏమిటంటే.

టక్ జగదీష్ రిలీజ్ అలా వాయిదా
సెకండ్ వేవ్ లాక్‌డౌన్‌కు షూటింగ్ పూర్తి చేసుకొన్న టక్ జగదీష్ రిలీజ్ కోసం వేచి చూసింది. ఆంధ్ర ప్రదేశ్‌లో కరోనావైరస్ సంఖ్య పెరిగిపోవడంతో థియేటర్లపై ఆంక్షలు విధించారు. కర్ఫ్యూ, పాక్షిక లాక్‌డౌన్ విధించడంతో తప్పని పరిస్థితిలో సినిమా రిలీజ్‌లు ఆగిపోయాయి. అందులో భాగంగానే టక్ జగదీష్ ప్రేక్షకుల ముందుకు రాలేకపోయింది. అయితే సెకండ్ లాక్‌డౌన్ తర్వాత రిలీజ్ చేయడానికి ప్రయత్నించగా.. ఏపీలో టికెట్ రేట్ పెంపు, ఇతర వ్యవహారాలు అడ్డంకిగా మారాయి.

టక్ జగదీష్ నిర్మాతల కీలక నిర్ణయం
అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో కరోనా థర్డ్ వేవ్ మొదలైందనే వార్తలు జోరందుకోవడంతో ఏ పరిస్థితుల్లోనైనా థియేటర్లు మళ్లీ మూతపడే అవకాశం కనిపిస్తున్నది. అంతేకాకుండా థియేటర్లు ఓపెన్ చేసినా ప్రేక్షకులు వచ్చే పరిస్థితి కనిపించలేదు. ఒకవేళ పెద్ద సినిమాలు రిలీజ్ చేస్తే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అనే అనుమానం కలుగుతున్నది. ఇలాంటి పరిస్థితుల మధ్య మళ్లీ థియేటర్లు మూతపడొచ్చనే వార్త వైరల్ అవుతున్నది. ఈ పరిస్థితుల్లోనే టక్ జగదీష్ నిర్మాతలు భారీ సాహసానికి పాల్పడ్డారు. త్వరలోనే నిర్మాతలు, చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటన చేయనున్నారు.

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు
అయితే కరోనావైరస్ పరిస్థితులు పెరిగిపోతుండటంతో ఏపీలో నైట్ కర్ఫ్యూ పెట్టే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నదనే వార్త టక్ జగదీష్‌పై పడింది. ఒకవేళ నైట్ కర్ఫ్యూ పెడితే థియేటర్లలో రిలీజ్ చేయడం ఇప్పట్లో కుదరని పని అనే విషయాన్ని నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది తీవ్రంగా పరిగణించారని తెలిసింది. ఆ క్రమంలో టక్ జగదీష్‌ను ఆపడం కాదని అమెజాన్‌తో చర్చలు జరిపి.. భారీ ఆఫర్‌ను దక్కించుకొన్నారనే విషయం చర్చనీయాంశమైంది. దీంతో మరికొంత స్టార్ హీరోల సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు మొదలైనట్టు తెలుస్తున్నది.

టక్ జగదీష్‌కు ఫ్యాన్సీ రేటు
తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులను బేరీజు వేసుకొన్న తర్వాత నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది అమెజాన్ ప్రైమ్ వీడియోతో చర్చలు జరిపారు. ఫ్యాన్సీ రేటును టక్ జగదీష్‌కు ఆఫర్ చేయడంతో ఓటీటీ రిలీజ్‌కు నిర్మాతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అమెజాన్‌తో చర్చలు జరగడానికి ముందు నాని, నిర్మాతలు, దర్శకులు, సంగీత దర్శకుల మధ్య భారీగా చర్చలు జరిగాయని, అయితే నాని, థమన్ ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఒప్పుకోలేదనే విషయం సినివర్గాల్లో చర్చనీయాంశమైంది.

నాని మనస్తాపం అంటూ
టక్ జగదీష్‌పై భారీగా ఆశలు పెట్టుకొన్న నాని, థమన్ ఓటీటీ రిలీజ్‌పై మనస్తాపం చెందారని తెలుస్తున్నది. అయితే కొద్ది రోజులు ఆగి థియేటర్లలో రిలీజ్ చేద్దామనే నాని ప్రతిపాదనకు నిర్మాతలు సానుకూలంగా స్పందించలేదనేది ఓ వార్త ప్రచారంలో ఉంది. అయితే ఓటీటీ రిలీజ్ చేయడం సినిమాకు మంచిది కాదనే విషయం నానిలో బలంగా ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. ఎందుకంటే టక్ జగదీష్‌కు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండటమే. ఓటీటీలో వస్తే మధ్య తరగతి వారికి ఈ సినిమా అందుబాటులో ఉండదు. అలాగే పైరసీ బారిన పడే అవకాశం ఎక్కువ అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. నాని కెరీర్‌లో ఇది రెండో ఓటీటీ సినిమా. గతంలో V చిత్రం ఓటీటీలో రిలీజై భారీ పరాజయం పొందిన విషయం తెలిసిందే.

నాని మనస్తాపం అంటూ
టక్ జగదీష్‌పై భారీగా ఆశలు పెట్టుకొన్న నాని, థమన్ ఓటీటీ రిలీజ్‌పై మనస్తాపం చెందారని తెలుస్తున్నది. అయితే కొద్ది రోజులు ఆగి థియేటర్లలో రిలీజ్ చేద్దామనే నాని ప్రతిపాదనకు నిర్మాతలు సానుకూలంగా స్పందించలేదనేది ఓ వార్త ప్రచారంలో ఉంది. అయితే ఓటీటీ రిలీజ్ చేయడం సినిమాకు మంచిది కాదనే విషయం నానిలో బలంగా ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. ఎందుకంటే టక్ జగదీష్‌కు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండటమే. ఓటీటీలో వస్తే మధ్య తరగతి వారికి ఈ సినిమా అందుబాటులో ఉండదు. అలాగే పైరసీ బారిన పడే అవకాశం ఎక్కువ అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. నాని కెరీర్‌లో ఇది రెండో ఓటీటీ సినిమా. గతంలో V చిత్రం ఓటీటీలో రిలీజై భారీ పరాజయం పొందిన విషయం తెలిసిందే.

ట్రెండింగ్‌లో టక్ జగదీష్
ఇక టక్ జగదీష్ సినిమాను వినాయక చవితి పండుగ కానుకగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తున్నది. అంటే సెప్టెంబర్ 10వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా అధికారికంగా ప్రకటన జారీ చేసింది. త్వరలోనే టక్ జగదీష్ రిలీజ్ కాబోతున్నది అంటూ ప్రకటన రాగానే.. #TuckJagadish ట్రెండింగ్‌లోకి వచ్చింది.
Recommended Video

టక్ జగదీష్‌లో నటీనటులు, సాంకేతిక నిపుణులు
నటీనటులు: నాని, రితూ వర్మ, ఐశ్వర్య రాజేశ్, జగపతి బాబు, డేనియల్ బాలాజీ, నాజర్, తిరువీర్, రోహిణి, దేవదర్శిని, నరేష్, రావు రమేష్, ప్రవీణ్ తదితరులు
రచన, దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
సినిమాటోగ్రఫి: ప్రసాద్ మూరెళ్ల
సంగీతం: ఎస్ థమన్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
బ్యానర్: షైన్ స్క్రీన్స్


Click it and Unblock the Notifications











