సాయిపల్లవితో నాని బైక్ షికారు: వరంగల్ ఫిదా అయ్యింది

వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎంసీఏ(మిడిల్‌క్లాస్‌ అబ్బాయి) ..ఓ సన్నివేశం కోసం నాని, సాయి పల్లవి ఇద్దరూ బైక్ పై చక్కర్లు.హన్మకొండ గ్రీన్‌ స్క్వేర్‌ ప్లాజా సమీపంలో నాని బైక్‌ రైడ్..

Recommended Video

Natural Star Nani Riding A Bike With Heroine Sai Pallavi

వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న న్యాచురల్‌ స్టార్‌ నాని తన బైక్‌ పై ఓ అమ్మాయిని కూర్చొబెట్టుకొని హన్మకొండ రోడ్లపై షికార్లు చేస్తు‍న్నాడు.యస్‌... యువ హీరో నాని ఇప్పుడు ఎంసీఏ చదువుతున్నారు. అదీ వరంగల్‌లో! ఊరుకోండి... హిట్లు మీద హిట్లు, హీరోగా మంచి స్థాయిలో ఉన్న నానీకి చదువుకోవలసిన అవసరం ఏముంది? అనుకుంటున్నారా!

ఇప్పుడు... స్టూడెంట్స్‌ అయితే డిగ్రీ వరకో, పీజీ వరకో చదువుతారు. అదే... హీరోలు అయితే ప్రతి ఏడాది చదువుకోవాలి. ఇది నిజంగా నిజం అయితే నాని ఏదో సరదాకి అలా రోడ్ల మీద తిరిగేయటం లేదు.. ప్రస్తుతం నాని, వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎంసీఏ(మిడిల్‌క్లాస్‌ అబ్బాయి) సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

Nani and Sai Pallavi spotted enjoying bike ride In Hanamkonda

షూటింగ్ లో భాగంగా ఓ సన్నివేశం కోసం నాని, సాయి పల్లవి ఇద్దరూ ఇలా బైక్ పై చక్కర్లు కొడుతున్నారు. బుధవారం ఉదయం హన్మకొండ గ్రీన్‌ స్క్వేర్‌ ప్లాజా సమీపంలో వీరిద్దరు బైక్‌ పై వెళ్తుండటంతో స్థానికులు వారిని చూసేందుకు ఎగబడ్డారు. ఇటీవల నిన్నుకోరి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్న నాని, ఎంసీఏతో పాటు కృష్ణార్జున యుద్ధం సినిమాలో కూడా నటిస్తున్నాడు.

నాచురల్ స్టార్ నాని అంటే ప్రేక్షకుల్లో చాలా క్రేజ్ ఉన్న హీరో. సాయి పల్లవి ఒక్క సినిమాతో ప్రేక్షకుల్ని ఫిదా చేసిన హీరోయిన్. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. ఇది మాత్రమే ప్రత్యేకం అనుకుంటే తప్పులో కాలేసినట్టే. హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు సారధ్యంలో.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్‌లో.. ఒక కీలక పాత్రలో భూమిక‌, విజ‌య్‌, సీనియ‌ర్ న‌రేష్‌, ఆమ‌ని త‌దిత‌రులు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ . శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీరామ్ వేణు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X