లిప్‌లాక్‌ను తలపిస్తున్న నాని-సమంత ఫోటో

By Bojja Kumar

హైదరాబాద్: నాని, సమంత కాంబినేషన్ లో గౌతమ్ మీనన్ రూపొందించిన చిత్రం 'ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ చిత్రం డిసెంబర్ 14న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం ఓకేసారి మూడు భాషల్లో రూపొందుతోంది. తెలుగులో ఈచిత్రానికి సి.కళ్యాణ్ నిర్మాత. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన నాని-సమంత స్టిల్ చర్చనీయాంశం అయింది.

ఈ ఫోటోలో ఇద్దరు లిప్ లాక్ రేంజిలో రొమాన్స్ చేస్తుండటం చూస్తుంటే...చిత్రంలో ఈ ఇద్దరి మధ్య లిప్ లాక్ సన్నివేశాన్ని దర్శకుడు ప్లాన్ చేసాడా? అనే అనుమానం కలుగుతోంది. గతంలో గౌతం మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏమాయ చేసావె చిత్రంలో సమంత-నాగ చైతన్య మధ్య లిప్ లాక్ సన్నివేశం ఉన్న సంగతి తెలిసిందే.

'ఎటో వెళ్లి పోయింది మనసు' సున్నితమైన భావోద్వేగాలతో సాగే ప్రేమకథ. ప్రణయగాథల్లో కొత్తకోణాన్ని ఆవిష్కరించేలా చిత్రాన్ని తీర్చిదిద్దాడు దర్శకుడు. తెరపై కనిపించే ప్రతి సన్నివేశం ఆసక్తిని రేకెత్తిస్తుంది. నాని, సమంత మధ్య వచ్చే సన్నివేశాలు యువతరాన్ని అలరిస్తాయి. ఇళయరాజా సమకూర్చిన పాటలకు చక్కటి స్పందన వస్తోంది.

తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ చిత్రం తెలుగు వెర్షన్‌లో హీరోగా నాని నటిస్తుండగా... తమిళ, హిందీ వెర్షన్లలో హీరోలుగా జీవా, ఆదిత్యరాయ్ కపూర్ నటిస్తున్నారు. ఈ మూడు భాషల్లోనూ సమంతానే కథానాయిక కావడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X