twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఎటో వెళ్లి పోయింది మనసు' ప్రివ్యూ (ఫొటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ఎటో వెళ్లి పోయింది మనసు' మొత్తానికి థియోటర్స్ లో ఈ రోజు దిగుతోంది. నాని,సమంత కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా సమంత పరిచయం చిత్రం ఏమి మాయ చేసావే తెలుగులో ఘన విజయం సాధించటంతో తెలుగులో గౌతమ్ మీనన్ కు మెయిన్ స్ట్రీమ్ దర్శకుడుకి ఉండేటంత క్రేజ్ క్రియేట్ అయ్యింది. ఈ చిత్రం ఓపినింగ్స్ కి అన్ని మల్టిఫ్లెక్స్ లు బుకింగ్ లు ఓపెన్ చెయ్యగానే ఫిల్ అయిపోయాయి.

    అలాగే ఈగతో నాని, సమంత జంట క్రేజ్ తెచ్చుకోవటం కూడా ఈ చిత్రానికి ప్లస్ అయ్యింది. నాని,సమంతలు సైతం ఈ చిత్రంపై మంచి హోప్స్ పెట్టుకున్నారు. సమంత ఈ చిత్రంలో తనకు డిఫెరెంట్ పాత్ర అని... టీనేజ్ అమ్మాయిగా,పెళ్లైన యువతిగా డిఫెరెంట్ గా ఒకే పాత్రలో కనిపిస్తున్నాని చెప్తోంది. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో పాటలన్ని అభిమానులును ఆకట్టుకున్నాయి. అనంత శ్రీరాం ఈ పాటలనన్నిటినీ సింగిల్ కార్డుతో రాసారు. ఈ చిత్రం ప్రోమో ఇప్పటికే రిలీజయ్య ఇళయారాజా అభిమానుల్లో ఆసక్తిని రేపింది. గ్యారెంటీగా మ్యూుజికల్ హిట్ అవుతుందని భావిస్తున్నారు.

    నాని, సమంత జంటగా గౌతమ్‌ వాసుదేవమీనన్ దర్శకత్వంలో తేజ సినిమా ప్రొడక్షన్స్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న చిత్రం 'ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సినిమాలో సమంత, నాని ఆరేళ్ల వయసులో కలుస్తారు. తర్వాత పదిహేనేళ్ల వయసులో కలుస్తారు. 20, 25ఏళ్ల వయసులోనూ కలుస్తారు. ఇలా ప్రతి ఏజ్‌లోనూ వాళ్ళలో వచ్చిన మార్పులు, భావోద్వేగాలు, అనుభూతులే ఈ సినిమా.

    'ఎటో వెళ్లి పోయింది మనసు' (ఫొటో ఫీచర్)

    నిజానికి నానికి ఈ చిత్ర దర్శకుడు గౌతమ్ మీనన్ వద్ద అసెస్టెంట్ గా చేయాలని కోరిక ఉండేది. అయితే ఆ అవకాసం కలగలేదు. దాంతో ఆయన దగ్గర ఈ చిత్రానికి నటుడుగా పనిచేసే అవకాసం రావటంతో నాని ఆనందానికి అంతేలేదు.

    'ఎటో వెళ్లి పోయింది మనసు' (ఫొటో ఫీచర్)

    గౌతమ్ మీనన్ చేతిలో రూపుదిద్దుకున్న సినీ కెరీర్ సమంత ది. ఏమి మాయ చేసావే చిత్రం ఆమె కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచి బిగ్ స్టార్స్ ప్రక్కన ఆఫర్స్ ఇప్పించింది. దాంతో ఆమె ఈ చిత్రానికి కథేమిటో కుూడా తెలుసుకోకుండా సైన్ చేసేసింది.

    'ఎటో వెళ్లి పోయింది మనసు' (ఫొటో ఫీచర్)

    'ఎటో వెళ్లి పోయింది మనసు ' చిత్రం ఓ అందమైన ప్రేమ కథ. అందరి జీవిల్లోనూ ఎప్పుడో ఒకప్పుడు ఈ చిత్రంలో పాత్రలు, భావోద్వేగాలు కనెక్టు అవుతాయంటున్నారు దర్శకుడు.

    'ఎటో వెళ్లి పోయింది మనసు' (ఫొటో ఫీచర్)

    చిత్రంలో నాని ఓ మిడిల్ కుర్రాడు వరుణ్ గా కనిపించనున్నాడు. కథ ప్రకారం ఓ సింపుల్ కుర్రాడు... ఓ అమ్మాయితో ప్రేమలో పడి గెలుచుకోవటం. అయితే అతనికున్న ఏకైక బలహీనత ఇన్ సెక్యూరిటీ. అదే అతని ప్రేమకి అడ్డంగా నిలుస్తుంది.

    'ఎటో వెళ్లి పోయింది మనసు' (ఫొటో ఫీచర్)

    చిత్రంలో నిత్యగా సమంత మరోసారి మ్యూజిక్ చేయటానికి సిద్దపడుతోంది.. ''నా అభిమాన దర్శకుడు రూపొందిస్తున్న 'ఎటో వెళ్లి పోయింది మనసు' చిత్రంలో హీరోయిన్‌గా నటించటమనేది ఈ సంవత్సరంలో నాకు వచ్చిన అపురూపమైన అవకాశంగా భావిస్తున్నా.. ఆ సినిమాలో కాలేజీ అమ్మాయిగా నటిస్తున్నా. ఒక అబ్బాయి, అమ్మాయిల నడుమ చోటు చేసుకున్న సంఘటన సమాహారంగా ఈ చిత్రం నిర్మితమవుతోంది. ఈ పాత్ర నా జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. అంతేకాక మూడు భాషల్లో హీరోయిన్‌గా నేనే నటిస్తున్నా అని ఉత్సాహంగా చెప్తోంది.

    'ఎటో వెళ్లి పోయింది మనసు' (ఫొటో ఫీచర్)

    నాని మాట్లాడుతూ ''చిన్నప్పటి నుంచీ ఇళయరాజా సంగీతం అంటే పిచ్చి. నా ఫోన్‌లో కూడా ఆయన పాటలే ఉంటాయి. నేను సహాయ దర్శకుణ్ని కావడానికి స్ఫూర్తినిచ్చిన దర్శకుల్లో గౌతమ్‌మీనన్‌ ఒకరు. వీరిద్దరితో సినిమా చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఈ కథ విన్నప్పుడు నా ప్రేమ కథే అనిపించింది. మనసు ఎటో వెళ్లిపోయింది. ప్రేక్షకులకీ అలాంటి భావనే కలుగుతుంది''అన్నారు.

    'ఎటో వెళ్లి పోయింది మనసు' (ఫొటో ఫీచర్)

    గౌతమ్‌ మీనన్ మాట్లాడుతూ -‘‘తెలుగులో నాకు మూడవ స్ట్రయిట్ ఫిలిం ఇది. ‘ఏ మాయ చేశావె'తో పోలిస్తే సమంతలో చాలా వైవిధ్యం కనిపించింది. అద్భుతమైన నటి ఆమెలో ఆవిష్కృతం అయ్యింది. నాని చాలా బాగా చేశాడు. కెమెరా ముందుకొస్తే ఎంతో లవ్లీగా కనిపించాడు తను. ఇళయరాజా అద్భుతమైన సంగీతాన్నందించారు. నేను చేసిన సినిమాల్లో నా ఫేవరెట్ మూవీ ఇది'' అన్నారు.

    'ఎటో వెళ్లి పోయింది మనసు' (ఫొటో ఫీచర్)

    ఈ చిత్రంలో కృష్ణుడు కూడా కీ రోల్ చేసారు. హిందీలో ఈ పాత్రను వినయ్ పాఠక్, తమిళంలో రవి రాఘవేంద్ర చేసారు.

    'ఎటో వెళ్లి పోయింది మనసు' (ఫొటో ఫీచర్)

    నిర్మాత సి.కళ్యాణ్‌మాట్లాడుతూ -‘‘ఈ సినిమా తీయడం గర్వంగా, ఆనందంగా ఉంది. 12 ఏళ్ల క్రితం గౌతమ్‌వాసుదేవమీనన్ తొలి చిత్రం ‘చెలి'ని నేనే విడుదల చేశాను. మళ్లీ గౌతమ్ సినిమా విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా ఎలా ఉంటుందో స్టిల్స్, టీజర్స్‌ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

    'ఎటో వెళ్లి పోయింది మనసు' (ఫొటో ఫీచర్)

    ఎటో వెళ్లి పోయింది టైటిల్.. గతంలో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన నిన్నా పెళ్ళాడతా చిత్రంలో హిట్టైన సాంగ్ లోది. అలాగే ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయినట్లే. తమిళంలో హీరోగా జీవా నటిస్తున్నారు. హిందీలో ఆదిత్యా రాయ్ కపూర్ చేస్తూండగా నాని తెలుగులో చేస్తున్నారు. మొదట రామ్ ని తెలుగుకు అనుకున్నారు కానీ అభిప్రాయ భేధాలతో రామ్ ఆ ప్రాజెక్టు నుంచి బయిటకు వచ్చేసారు. సమంత మాత్రం ఈ భాషల్లోనూ హీరోయిన్ గా చేస్తోంది. ఇది ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్.

    English summary
    Much-awaited movie Yeto Vellipoyindhi Manasu (YVM), which is scheduled to hit the screens across the globe Today, December 14. Yeto Vellipoyindhi Manasu is a young romance drama, which has been written and directed by Gautham Menon. It is a story of a guy and a girl named Varun and Nithya. Their love story has been dealt in three different phases like school, college and life after that. The movie has a tagline: This could be your love story.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X