నా సినిమా సూపర్ హిట్టా? నాని భలే సెటైర్ వేశారే..
Recommended Video

Nani Makes Funny Tweets On His Movie
వరుస సినిమాలు, సక్సెస్‌లతో దూసుకెళ్తున్న టాలీవుడ్ హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకరు. సినిమాల్లోనే కాదు ఆయన నిజజీవితంలో చాలా హుషారుగా ఉంటారు. సరదాగా సెటైర్లు వేయడమే కాదు.. తనపై కూడా వేసుకొంటారు. అయితే హిట్లతో ముందుకెళ్తున్న నానికి ఇటీవల రిలీజైన కృష్ణార్జునయుద్ధం చిత్రం నిరాశపరిచింది. ఈ చిత్రాన్ని ఇటీవల ఓ యూట్యూబ్ టెలివిజన్ ఛానెల్ ఆ చిత్రాన్ని కొనుగోలు చేసింది. ఆ క్రమంలో నాని నటించిన సూపర్ హిట్ చిత్రం 'కృష్ణార్జున యుద్దం'ను మా ఛానెల్‌లో చూడండి అని ట్వీట్ చేశారు.

ఆ ట్వీట్‌పై నాని స్పందిస్తూ.. కృష్ణార్జున యుద్ధం సూపర్ హిట్ అట. మేమైతే మనసుపెట్టి చేశాం. అది హిట్ అవలేదు బాబాయ్. ఆ చిత్రం సరిగా ఆడలేదు కూడా. మీరు హిట్ చేశారు .. చేసేయండి అని నాని ట్వీట్ చేయడం నెటిజన్లను ఆకర్షించింది.


Click it and Unblock the Notifications











