twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎ, బి, సి సెంటర్లన్నీ అబద్దం అంటున్నాడు

    By Srikanya
    |

    సెగ సినిమా విడుదలయ్యాక నాని రకరకాల స్టేట్మెంట్ తో జనాల్ని ఆకట్టుకోవాలని చూస్తున్నాడు. ఆయన రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ..ఎక్కడా ఎ,బి,సి సెంటర్లు అనేవి ఉండవు. వాటిని నేను నమ్మను. ఎక్కడ ప్రేక్షకుడైనా ఒకటే.వాడి మెంటల్ స్టేటస్ ఒకేలా ఉంటుంది.సినిమా జనం తమ వాళ్ళు సరైన సినిమాలు తీయలేక నెట్టేయటానకి తయారు చేసుకున్న కారణాలు ఇవి. రూరల్ జనం, టౌన్ లో జనం కూడా మెట్రోల్లో జనంలాగేనే ఫీలవుతారు. ఇక సెగ సినిమా అధ్బతమైన రెస్పాన్స్ మొదటి షో నుంచే వచ్చింది. ఇది అన్నవర్గాల ప్రేక్షకులను సెంటర్లను అలరిస్తుంది.

    ప్యూచర్ లో ఈ చిత్రం ఒక రిఫెరెన్స్ గా ఉండి..ఎ,బి,సి సెంటర్లలు లేకుండా ఆడిన సినిమాగా నిలిచిపోతుంది అన్నారు. సెగ చిత్రం మొన్న శుక్రవారం విడుదలై నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. పూర్తిగా తమిళ వాసనలతో నిండిపోయిన చిత్రంగా ప్రేక్షకులకు అంటున్నారు. అలాగే నాని, నిత్యామీనన్ కాంబినేషన్ చూసి అలా మొదలైంది లాంటి సినిమా అనుకుని వెళ్లిన వారికి నిరాశే మిగిలింది. పూర్తి డార్క్ కథతో కూడిన ఈ చిత్రం వినోదానికి పూర్తి దూరంగా ఉండటం కూడా ఓ మైనస్ గా చెప్తున్నారు.

    English summary
    Nani says “mental states of all the audience will be same. There is no A, B or C class. Sega has got tremendous response without drop from the very first show in rural centers”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X