నాని డైరక్టర్ కరాటేలో బ్లాక్ బెల్ట్ హోల్డర్ కావడంతో....
ఇందులో నాని వైవిధ్యమైన పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాతో ఆయన మంచి మాస్ హీరోగా స్థిరపడతారు. అంజన కరాటేలో బ్లాక్ బెల్ట్ హోల్డర్ కావడంతో యాక్షన్ ఎపిసోడ్స్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నిత్యమీనన్‌తో పాటు బిందుమాధవి కూడా ఇందులో నటించారు అంటూ నాని తాజా చిత్రం 'సెగ" గురించి చెప్పుతున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాత అశోక్ వల్లభనేని మాట్లాడుతూ... అలాగే హీరో నాని ఇప్పటివరకూ చేసినవన్నీ క్లాస్ సినిమాలే. తను తొలిసారి చేస్తున్న పూర్తి మాస్ సినిమా 'సెగ". అయితే రెగ్యులర్ మాస్ ఫార్ములాతో కాకుండా కొంచెం భిన్నంగా వుంటుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 15న ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియోను విడుదల చేస్తాం. జూన్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం"" అని నిర్మాత తెలిపారు. అంజన దర్శకత్వంలో మన దేశం మూవీస్ పతాకంపై అశోక్ నిర్మిస్తున్న చిత్రం 'సెగ". నాని, నిత్యామీనన్, బిందుమాధవి ఇందులో ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఇక దర్శకురాలు మాట్లాడుతూ- ''యువతరం ఆవేశపూరిత నిర్ణయాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. తమిళంలో ఈ చిత్రాన్ని గౌతమ్ మీనన్ నిర్మిస్తున్నారు. నాని యాక్షన్ అందర్నీ ఆకట్టుకుంటుంది. జోష్వా శ్రీధర్ సంగీతం ఈ సినిమాకు మెయిన్ హైలైట్"" అని చెప్పారు. దర్శకురాలు అంజన ఈ చిత్రంతో సినీ పరిశ్రమకు పరిచయమవుతున్నారు. తమిళంలో పేరుపొందిన దర్శకుల వద్ద ఆమె శిష్యరికం చేశారు. ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని తమిళంలో దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మిస్తుంటే, తెలుగులో మనదేశం మూవీస్ పతాకంపై అశోక్ వల్లభనేని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











