For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఒకే ఫ్రేమ్ లో నాని, ప్రభాస్, ఎన్టీఆర్ తో పాటు మరో ఇద్దరు స్టార్స్.. కన్నుల పండుగగా..

  |

  మల్టీస్టారర్ సినిమాల వలన అభిమానుల్లో కూడా చాలా మార్పులు వస్తాయని చెప్పవచ్చు. జస్ట్ హీరోలు అలా సరదాగా కలుసుకొని ఒక ఫోటో దిగితేనే అభిమానులు ఒక రేంజ్ లో సంబరపడిపోతారు. ఇక వారు కలిసి సినిమా చేస్తే ఆ ఆనందమే వేరు. ఇక నేచురల్ స్టార్ నాని ఇండస్ట్రీలో అందరితో క్లోజ్ గా ఉంటాడు. గతంలో మన అగ్ర హీరోలతో కలిసి దిగిన ఒక ఫొటోను తన సోషల్ మీడియా ఎకౌంట్ లో పోస్ట్ చేసి వైరల్ అయ్యేలా చేశాడు. ఆ ఫొటో అభిమానులకు కన్నుల పండుగగా ఉందని చెప్పవచ్చు.

  దోస్తీ సాంగ్ నిమిషాల్లోనే వైరల్

  దోస్తీ సాంగ్ నిమిషాల్లోనే వైరల్

  నేడు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ప్రపంచంలో ఉన్న సెలబ్రెటీలు సైతం వారి స్నేహితులకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. ఇక నేడు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా RRR మొదటి సాంగ్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దోస్తీ సాంగ్ నిమిషాల్లోనే సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది.

  నాని స్పెషల్ ఫొటోస్

  నాని స్పెషల్ ఫొటోస్

  మన టాలీవుడ్ హీరోలు ఎవరికి వారు వారికి నచ్చిన ఫొటోలను షేర్ చేసుకుంటున్నారు. నేచురల్ స్టార్ నాని కూడా కొన్ని ఫొటోలను పోస్ట్ చేశాడు. అందులో చిన్ననాటి స్నేహితులకు సంబంధించిన ఫొటోను కూడా జత చేయడం విశేషం. నాని స్నేహితులకు ఎంత వాల్యూ ఇస్తాడో అతని పోస్ట్ లు చూస్తుంటేనే అర్ధమవుతోంది.

  ఒకే ఫ్రేమ్ లో అగ్ర హీరోలతో..

  ఒకే ఫ్రేమ్ లో అగ్ర హీరోలతో..

  ఇక ఆ ఫొటోలతో స్టార్ హీరోలతో ఉన్న ఒక ఫోటో అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రానా.. వంటి అగ్ర నటులతో నాని నవ్వుతూ స్టిల్ ఇవ్వడం వైరల్ గా మారింది. ఇలాంటి ఫ్రేమ్ కోసమే మేము అందరం ఎదురుచూస్తున్నాం అంటూ అభిమానులు కూడా కామెంట్ చేస్తున్నారు.

  నాని అంటే..ప్రత్యేకమైన గౌరవం

  నాని అంటే..ప్రత్యేకమైన గౌరవం

  నానితో అందరి హీరోలకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఒకవిధంగా ఇండస్ట్రీలో చాలామందికి నాని అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం కూడా ఉంది. ఎందుకంటే దాదాపు అగ్ర హీరోలు అందరూ కూడా ఏదో బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి వచ్చినవారే.. కానీ నాని మాత్రం సోలో స్టార్ గా ఎదిగాడు. అందుకే అతన్ని అందరూ ఇష్టపడతారు.

  టక్ జగదీష్ రెడీ..

  టక్ జగదీష్ రెడీ..

  ఇక ప్రస్తుతం నాని వరుసగా నాలుగు విభిన్నమైన సినిమాలను లైన్ లో పెట్టాడు. ముందుగా టక్ జగదీష్ ప్రేక్షకుల ముందుకు రానుంది. శివ నిర్వణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను గత సమ్మర్ లోనే విడుదల చేయాల్సింది కానీ కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ వలన వాయిదా వేయక తప్పలేదు.

  Actor Nani Biography వివాదాలను హుందా గా ఎదుర్కున్న స్టార్!! || Filmibeat Telugu
  నెవ్వర్ బిఫోర్ అనేలా.. స్ట్రాంగ్ లైనప్

  నెవ్వర్ బిఫోర్ అనేలా.. స్ట్రాంగ్ లైనప్

  ఇక నాని ప్రస్తుత లైనప్ అయితే నెవ్వర్ బిఫోర్ అనేలా ఉంది. శ్యామ్ సింగరాయ్ పిరియాడిక్ డ్రామాగా రూపొందుతోంది. అందులో సస్పెన్స్ అంశాలు చాలానే ఉంటాయట. ఇక అంటే సుందరానికి.. సినిమా డిఫరెంట్ కామెడీ జానర్ లో రూపొందుతోంది. అనంతరం మరొక సినిమాను కూడా త్వరలోనే సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. మరి ఈ సినిమాలతో నాని తన మార్కెట్ ను ఏ రేంజ్ లో పెంచుకుంటాడో చూడాలి.

  English summary
  Natural star Nani stays close with everyone in the industry. He posted a photo of himself landing with our top heroes in the past on his social media account and went viral. That photo was a feast for the eyes for fans.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X