నాని సినిమా కోసం భారీ సెట్స్.. మొదటిసారి బిగ్ బడ్జెట్!
V సినిమాతో బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని అనుకున్న నానికి లాక్ డౌన్ దెబ్బేసింది. ఆ సినిమా ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. రిజల్ట్ సంగతి పక్కన పెడితే థియేటర్స్ లోకి సినిమా వచ్చి ఉంటే ఓపెనింగ్స్ మాత్రం పవర్ఫుల్ గా ఉండేవని అప్పటి బజ్ చూస్తేనే అర్ధమయ్యింది. నిజానికి నాని బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ అందుకొని చాలా కాలమవుతోంది. వైవిధ్యమైన కథలతో ఆకట్టుకుంటున్నప్పటికి ఇంకా అనుకున్నంత స్థాయిలో ఈ స్టార్ క్లిక్కవ్వడం లేదు.
అయితే నాని నెక్స్ట్ శ్యామ్ సింగరాయ్ సినిమా కోసం నిర్మాతలు బడ్జెట్ విషయంలో ఏ మాత్రం వెనుకాడడం లేదు. టాక్సివాలా దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తో శ్యామ్ సింగరాయ్ సినిమా చేయడానికి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.పిరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు బడ్జెట్ చాలానే ఖర్చయ్యే అవకాశం ఉందట. సినిమాలో కాళికా మాత టెంపుల్ హైలెట్ కానుందట.

ఆ టెంపుల్ కోసమే భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా సినిమా కోసం 60కోట్ల వరకు ఖర్చయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. నాని కెరీర్ లో ఇంతవరకు ఈ స్థాయిలో ఖర్చు చేయలేదు. దర్శకుడు చెప్పిన కథ అభిమానుల అంచనాలకు తగ్గట్లుగానే ఉంటుందట. అందుకే నిర్మాతలు ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. ఇక సినిమాలో సాయి పల్లవితో పాటు ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఈ నెల 25న నాని పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











