twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాని మాట్లాడింది 'జబర్ధస్త్' సినిమా గురించే...?

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'ఆహా కళ్యాణం' లాంటి కథే ఒకటి ప్రేక్షకుల ముందుకొచ్చింది అని ప్రచారం సాగుతోంది. మనదగ్గరున్నవి ఐదారు కథలే. వాటితోనే కొన్ని వందల, వేల సినిమాలను తెరకెక్కించాం. ఈ సినిమా కూడా అందులో ఒకటే. అందుకే ఈ సినిమాను ఈ సినిమాగానే చూడండి. మిగిలిన అంశాలను మిళితం చేసి చూడవద్దు అన్నారు నాని. 'ఆహా కళ్యాణం' కథ గతంలో జబర్ధస్త్ అనే చిత్రంగా వచ్చిందనే విషయంపై నాని ఇలా స్పందించారు. 'ఆహా కళ్యాణం' ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడారు.

    నాని మాట్లాడుతూ... ''పెళ్ళిళ్ల సీజన్‌ ఎప్పుడొస్తుందో నాకు అంతగా తెలియదు. అయితే ఈ నెల 21 నుంచి మాత్రం మనకు ఆ సీజన్‌ మొదలవుతుందని చెబుతాను. మా సినిమాలో తొలి సన్నివేశం నుంచి చివరి వరకూ పెళ్లి బాజాలే మోగుతుంటాయి. ప్రేక్షకులకు అప్పుడప్పుడే కల్యాణ మండపం వెళ్లొచ్చిన అనుభూతి కలుగుతుంది'' అన్నారు నాని.

    Nani speak about Jabardasth?

    అలాగే... ''ఒక వేడుకలాగా సాగే సినిమా ఇది. ధరన్‌ కుమార్‌ స్వరపరిచిన గీతాలకు చక్కటి స్పందన లభిస్తోంది. ఇది నాకు ప్రత్యేకమైన చిత్రం. సవాల్‌తో కూడిన పాత్రను పోషించాను. రీమేక్‌ సినిమా చేయడం ఆషామాషీ కాదు. మాతృక కంటే రెండింతలు కష్టపడాల్సి ఉంటుంది. నిజానికి మనకున్నది ఐదారు కథలే. వాటితోనే వేలాది చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకాదరణ పొందాయి. అందులో ఈ సినిమా కూడా ఒకటి అవుతుంది. మన దక్షిణాది వాతావరణానికి తగ్గట్టుగా చక్కటి వెటకారం, వినోదం మేళవింపుతో ఈ చిత్రం సాగుతుంది. ఇంటిల్లిపాదినీ అలరిస్తుందన్న నమ్మకం నాకుంది. వాణికపూర్‌ ప్రతీ చిన్న విషయంపైనా శ్రద్ధ చూపిస్తూ నటించింది'' అన్నారు.

    ''యశ్‌రాజ్‌ సంస్థలో నేను చేస్తున్న రెండో చిత్రమిది. 'ఆహా కళ్యాణం'లాంటి ఓ మంచి చిత్రంతో దక్షిణాదిన పరిచయం అవుతుండడం ఆనందంగా ఉంది'' అన్నారు వాణీకపూర్‌. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ధరన్‌కుమార్‌, గీత రచయిత కృష్ణచైతన్య, పదమ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. నాని హీరోగా నటించిన చిత్రం 'ఆహా కళ్యాణం'. వాణీ కపూర్‌ హీరోయిన్. గోకుల్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. ఆదిత్య చోప్రా నిర్మాత. ఈ నెల 21న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

    English summary
    "Basically there are only 5 or 6 basic plots and hundreds of films are made on these plots. If the film is good people will watch it," opined Nani. Nani said that he is confident that this film will appeal to the Telugu audiences. This film is based on Bollywood film Band Bajaa Baraat, which starred Ranveer and Anushka Shetty. Siddarth and Samantha starrer Jabardasth, which came to the screens last year, was also on similar lines.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X