మంచి సినిమా పక్కన ఆ పదాలు వద్దు, కొంచెం తగ్గినా తట్టుకోలేను: ‘జెర్సీ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నాని

Recommended Video

Nani Speech At 'Jersey' Movie Pre Release Event || Filmibeat Telugu

నాని హీరోగా గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం 'జెర్సీ'. పి.డి.వి.ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్ర‌ద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌‌గా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా నాని ఎమోషనల్‌గా మాట్లాడారు. ఇది తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన సినిమా అన్నారు. ఇది పక్కా మీ అందరికీ నచ్చే సినిమా, బ్లాక్ బస్టర్ అనే మాట సరిపోదేమో.. ఒక మంచి సినిమా పక్కన ఇలాంటి పదాలు అసలు పెట్టకూడదేమో అనిపిస్తుందన్నారు.

వెంకటేష్ గారు ఆవకాయ లాంటి వారు

వెంకటేష్ గారు ఆవకాయ లాంటి వారు

వెంకటేష్ గారు ఆవకాయ లాంటి వారు. ఆయనంటే ఇష్టపడని తెలుగు ప్రేక్షకుడు ఉండరు. నేను పెద్దతెరపై చూసి రియల్ లైఫ్ లో నాకు బాగా దగ్గరయ్యాక నచ్చిన ఒకే ఒక్క స్టార్ వెంకటేష్ గారు. నేను ఆయన ఫంక్షన్‌కు వెళ్లాలనే కోరిక ‘బాబు బంగారం'తో తీరిపోయింది. ఆయన నా ఫంక్షన్ కు వస్తే బావుండు అనేది ‘జెర్సీ'తో తీరిపోయింది. ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలనే కోరిక ఇంకా బలంగా అలాగే ఉంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. జర్సీ నాకు ఆల్రెడీ స్పెషల్ మూవీ, ఆయన రాకతో మరింత స్పెషల్ అయిందని నాని తెలిపారు.

ఏప్రిల్ 19న ఈ సినిమా చూసిన అందరూ గర్వపడతారు

ఏప్రిల్ 19న ఈ సినిమా చూసిన అందరూ గర్వపడతారు

ఏప్రిల్ 19న ఈ సినిమా చూసిన అందరూ గర్వపడతారు. గౌతమ్‌ను చూసి, నాని చూసి, శద్దాను చూసి... ఈ సినిమాకు పని చేసిన ప్రతి వారిని చూసి గర్వపడతారు. మా నాన్న, జున్నుగాడు అందరూ గర్వపడతారు. మీ అందరు గర్వించదగ్గ సినిమాలో నేను కూడా భాగం అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది.

మంచి సినిమా పక్కన అలాంటి పదాలు పెట్టకూడదు

మంచి సినిమా పక్కన అలాంటి పదాలు పెట్టకూడదు

ఈ సినిమా కచ్చితంగా హిట్. బ్లాక్ బస్టర్ అనే మాట సరిపోదేమో.. ఒక మంచి సినిమా పక్కన ఇలాంటి పదాలు అసలు పెట్టకూడదేమో అనిపిస్తుంది. అంతగొప్ప సినిమాలో చేశాననే సంతృప్తి ఉంది. ఎందుకు అలా ఉంది అనేది ఏప్రిల్ 19న మీకు కూడా అర్థమవుతుంది.

డైరెక్టర్ ఇక్కడ లేరు, ఆయన సినిమా మాట్లాడుతుంది

డైరెక్టర్ ఇక్కడ లేరు, ఆయన సినిమా మాట్లాడుతుంది

ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా గౌతమ్ గురించి చెప్పాలి. ఈ సినిమాకు ఎంత కష్టపడ్డాడో నాకు మాత్రమే తెలుసు. ఈ రోజు ఇక్కడ లేరు. చెన్నైలో సినిమాకు సంబంధించిన పని ఉంటే వెళ్లాడు. అదీ గౌతమ్ డెడికేషన్ అంటే. గౌతమ్ ఈ రోజు ఈ స్టేమీద ఉండి మాట్లాడక పోయినా ఆయన తీసిన సినిమా ఏప్రిల్ 19న మాట్లాడుతుంది.

అందరూ కథలోనే ఇన్వాల్వ్ అయ్యారు

అందరూ కథలోనే ఇన్వాల్వ్ అయ్యారు

ఈ సినిమాలో అందరూ కథ చెప్పడంలోనే ప్రాసెస్ అయ్యారు. సాను సినిమాటోగ్రఫీ కథ చెబుతుంది, అనిరుధ్ సంగీతం, నవీన్ ఎడిటింగ్, అవినాష్ ఆర్ట్ డైరెక్షన్ కూడా కథ చెప్పినట్లు ఉంటుంది. అంత అందంగా తీసిన సినిమా ఇది.

 మీ దృష్టిలో కొంచెం తగ్గినా తట్టుకోలేను

మీ దృష్టిలో కొంచెం తగ్గినా తట్టుకోలేను

ఈ సినిమా గురించి ఏం చెప్పినా తక్కువే అవుతుంది. జెర్సీ ట్రైలర్ స్టైల్ లో చెప్పాలంటే ఇంత పెద్ద ప్రపంచంలో నన్ను ఇప్పటి వరకు జడ్జ్ చేయంది తెలుగు ప్రేక్షకులు మాత్రమే. మీ దృష్టిలో కొంచెం తగ్గినా తట్టుకోలేను. ఏప్రిల్ 19న థియేటర్లో కలుసుకుందాం.. అంటూ నాని తన ప్రసంగం ముగించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X