రాజమౌళి స్టార్ డైరెక్టర్. కానీ చాలా సింపుల్: నాని
రాజమౌళి స్టార్ డైరెక్టర్. కానీ ఆయన చాలా సింపుల్‌గా ఉంటారు.కథ మొత్తం వివరించారు అంటున్నాడు అష్టాచెమ్మా నాని. నాని తాజాగా రాజమౌళి దర్శకత్వంలో ఈగ చిత్రంలో చేస్తున్నారు. ఆ చిత్రం గురించి చెపుతూ...ఈగ కథ అల్లిన విధానం నన్ను చాలా బాగా ఆకట్టుకుంది. నటుడిగా నన్ను నేను నిరూపించుకునే అవకాశం దక్కింది. దర్శకుడిగా రాజమౌళికి అభిమాన లోకం ఉంది. 'ఈగ' చిత్రం ద్వారా నేనూ చాలామందికి తెలిసే అవకాశం ఏర్పడుతుంది అన్నారు. అలాగే తనకు సహజత్వానికి దగ్గరగా ఉండే చిత్రాలు అంటే ఇష్టమని..కమర్షియల్, నేచురల్...అనేదాంట్లో సహజత్వానికి దగ్గరగా ఉండే స్టోరీనే ఎంచుకుంటా. తమిళంలో ఇలాంటి స్టోరీలు చాలా వస్తున్నాయి. ఆడే అవకాశమూ ఎక్కువే.. తెలుగు, తమిళ భాషల్లో కలిపి చేసే చిత్రాల్లో నటించాలన్న కోరిక ఉంది అన్నారు. రీసెంట్ గా నాని హీరోగా నందినీరెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'అలా మొదలైంది' బాక్సీఫీస్ మంచి టాక్ తెచ్చుకుని స్టడీగా ముందుకెళ్థోంది.


Click it and Unblock the Notifications











