వెంకటేష్ ప్లేసులోకి నాని
వెంకటేష్, తేజ కాంబినేషన్ లో ప్లాన్ చేసిన 'సావిత్రి' చిత్రం ఆ మధ్యన ప్రారంభం కాకుండాన ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రం నానితో తెరకెక్కుతున్నట్లు సమాచారం. తాజాగా తాను రూపొందిస్తున్న 'నీకు నాకు డేష్ డేష్' చిత్రం తర్వాత దర్శకుడు తేజ తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'సావిత్రి'ని మళ్ళీ ప్రారంభించేందుకు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సహకారంతో 2010లోనే తేజ ప్రారంభించారు. అయితే కొన్ని కారణాలవల్ల మధ్యలోనే ఆ చిత్రం ఆగిపోయింది. అయితే దీన్ని పూర్తి చేయాలనే ఆసక్తిని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ కనబరుస్తున్నట్టు తెలుస్తోంది.
మొదట ఈ సినిమాకు హీరోగా వెంకటేష్ ను అనుకున్నారు. కాని ఇప్పుడు వెంకటేష్ కు బదులుగా నానిని హీరోగా తీసుకోవాలని దర్శక, నిర్మాతలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలోని 'ఎటో వెళ్ళిపోయింది మనసు' సినిమాలో నాని నటిస్తున్నారు. అలాగే రాజమౌళి దర్శకత్వంలో అతను నటిస్తున్న 'ఈగ' సినిమా చివరిదశలో వుంది. ఈ ప్రాజెక్టుల తర్వాత 'సావిత్రి'లో నాని నటించనున్నట్టు సమాచారం. అలాగే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతున్న ఎటో వెళ్లిపోయింది మనస్సు చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది.


Click it and Unblock the Notifications











