twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాని హీరోగా 'బ్యాండ్‌ బాజా బారాత్‌' ప్రారంభం

    By Srikanya
    |

    హైదరాబాద్ : హిందీలో సూపర్ హిట్ చిత్రం 'బ్యాండ్‌ బాజా బారాత్‌'. ఈ సినిమాను దక్షిణాది భాషల్లో పునర్‌ నిర్మిస్తోంది యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ సంస్థ. ఇందులో హీరోగా నాని నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ మొదలైంది. గోకుల్‌కృష్ణ దర్శకుడు. తొలుత ఈ చిత్రాన్ని తమిళంలో రూపొందిస్తారు. దాన్ని తెలుగులోకి డబ్ చేస్తారని సమాచారం.

    ఇక ఇదే సబ్జెక్టుతో రొమాంటిక్ ఎంటర్టైనర్ 'జబర్‌దస్త్' ఆ మధ్యన విడుదలై ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది . ఈ విషయమై నాని స్పందిస్తూ.. " నేను చేస్తున్న సినిమా ఆల్రెడీ మొదలైంది. తెలుగు,తమిళ భాషల్లో విడుదల అవుతుంది. ," ఖరారు చేసారు. అలాగే... బ్యాండ్ బాజా బారాత్ ప్రిమైజ్, జబర్దస్త్ ప్రిమైజ్ ఒకటే అంటున్నారు అని అడగగా.. "నేను ఇప్పటివరకూ ఆ సినిమాని చూడలేదు. అయితే చాలా మంది హిందీ సినిమాలాంటి సిమిలర్ కథ అంటున్నారు... .", అయితే ఏమన్నా లీగల్ యాక్షన్ తీసుకునే అవకాసం ఉంటుందంటారా అంటే.. " నేను ప్రొడ్యూసర్ కాదుగా అని తేల్చేసారు..

    మరో ప్రక్క దర్శకురాలు నందినీరెడ్డి ఈ వివాదంపై స్పందిస్తూ... "నేను బ్యాండ్ బజా బారత్ కి మా సినిమాకు పోలిక ఉంటుందనుకోలేదు.. అలాగే మా సినిమాలో హీరో,హీరోయిన్స్ ఈవెంట్ మేనేజర్స్ మాత్రమే...వెడ్డింగ్ ప్లానర్స్ కాదు. వారు ప్రెషర్స్ పార్టీలు, కార్పోరేట్ పంక్షన్స్, షష్టిపూర్తి ఉత్సవాలు వంటివి కూడా చేస్తారు. అంతేకాదు మేము మా సినిమాకు తీసుకున్న కంపెనీ కూడా ఈవెంట్ మేనేజమెంట్ కంపెనీ...నేను ఈవెంట్ మేనేజ్ మెంట్ ని మా సినిమా కు బ్యాక్ డ్రాప్ గా తీసుకోవటానికి కారణం...సినిమాకు కొత్త కలర్,లుక్ వస్తుందని మాత్రమే ..అయినా వెడ్డింగ్ ప్లానర్స్ బ్యాక్ డ్రాప్ లో చాలా హాలీవుడ్ చిత్రాలు వచ్చాయి...అని తేల్చి చెప్పారు.

    అంతేకాదు తాను చాలా దాదాపు 23 సినిమాల నుంచి ప్రభావితురాలునయ్యానని అన్నారు. క్లైమాక్స్ సీన్ ని ..జానే బీ దో యారో నుంచి తీసుకున్నాను. అలాగే అమితాబ్ ..యారానా లో కొన్ని సీన్స్, డేవిడ్ ధావన్ స్టైల్ ఆఫ్ మేకింగ్ ని నేను ఈ సినిమాలో ఫాలో అయ్యాను అని చెప్పుకొచ్చారు.

    English summary
    Nani has been roped in for the debut movie of Yash Raj Films in the Southern film industry. Right now, Nani is one of the most sought after actors of Tollywood as he has got 3 films to be released soon, "Paisa", "Janda Pai Kapiraju" and "Yeto Velipoindhi Manasu". The film is a Tamil and Telegu remake of the hit film of Yrf house, "Band Baaja Baarat". In the original Hindi flick, Anushka Sharma and Ranveer Singh played the lead roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X