ది గ్రేట్ క్రియేటివ్ డైరెక్టర్ తో గ్రేట్ ఛాన్స్ కొట్టేసిన కుర్రహీరో..!
'అష్టాచమ్మా"తో హీరోగా పరిచయమైన నాని 'అలా మొదలైంది" తో కమర్షియల్ హీరో అయిపోయాడు. రాజమౌళి రూపొందిస్తున్న 'ఈగ"తో నాని హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసురకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇదిలా వుంటే క్రియేటివ్ డైరెర్టర్ గా పేరుతెచ్చుకున్న కృష్ణ వంతీ దర్శక్వంలో 'మిరపకాయ్"నిర్మాత రమేష్ పుప్పాల, కిక్, డాన్ శ్రీను, ప్రేమకావాలి వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించి ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ రోజు(29.06.11) ఉదయం పూజాకార్యక్రమాలతో ప్రారంభమైనది. ఓయాక్షన్ కామెడీ చిత్రంగా రూపొందే ఈ చిత్రం జూలైలో రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభించి డిసెంబర్ లో సినిమా విడుదలకు సిద్దం చేస్తామంటున్నారు దర్శక నిర్మాతలు..
గులాబి, నిన్నేపెళ్ళాడతా, సిందూరం, మురారి, అంత:పురం, ఖడ్గం, చందమామ, వంటి సూపర్ హిట్ చిత్రాలందించిన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ సరికొత్త స్టైల్ లో యాక్షన్ కామెడీగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో నాని సరసన ఇద్దరు హీరోయిన్ లు నటిస్తారని తెలిసింది. 2011లో'అలా మొదలైంది" తో పెద్ద డైరెక్టర్ల దృష్టిలో పడ్డ నాని రాజమౌళి తో ఓ సినిమా చేస్తుండగా ఇప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలు సక్సెస్ అయితే తను కూడా టాప్ హీరోల సరసన చేరతానన్న కాన్ఫిడెన్స్ తో వున్నాడు నాని...


Click it and Unblock the Notifications











