Nani Dasara Trailer: ఒక్కొక్కనికి మొల్దారం కింద గూడలు రాల్తయ్.. నెవ్వర్ బిఫోర్ నాని.. బీభత్సం!
నేచురల్ స్టార్ నాని నటించిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ దసరా మార్చి 30వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాతో ఎలాగైనా ఫ్యాన్ ఇండియా మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకోవాలి అని నాని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను నేడు గ్రాండ్ గా విడుదల చేశారు. ఇక ట్రైలర్ తోనే సినిమాను అద్భుతమైన సన్నివేశాలు ఉండబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇక మొత్తంగా ట్రైలర్ ఎలా ఉంది అనే వివరాల్లోకి వెళితే..

పెట్టి పుట్టావురా నా కొడకా..
దసరా సినిమా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇక బతుకమ్మ పాటతో మొదలైన సినిమా ట్రైలర్ లో కీర్తి సురేష్ కూడా వెన్నెల పాత్రతో ఎంట్రీ ఇచ్చింది. ధరణిగా పెట్టి పుట్టావురా నా కొడకా.. అంటూ ఆమె పెళ్లికూతురుగా కనిపించిన విధానం హైలెట్ గా నిలిచింది. ఇక నాని మరోవైపు ఊర మాస్ యాక్షన్ లుక్కుతో మద్యం తాగుతూ గొడవలు పడుతూ కనిపిస్తున్నాడు.

నాని డిఫరెంట్ టైమింగ్
ఇక మద్యం మత్తులో విచ్చలవిడిగా కొడుతూ బీభత్సం సృష్టించే నాని క్యారెక్టర్ సినిమాలో మంచి కామెడీ టైమింగ్ తో కూడా అలరించబోతున్నట్లు అర్థం అవుతుంది. పోలీస్ స్టేషన్లో వచ్చే కామెడీ సీన్ కూడా ఇందులో హైలెట్ గా నిలిచింది. మా నాయనమ్మ తోడు ఒక్క దెబ్బ పడ్డ చచ్చిపోతా.. అంటూ డిఫరెంట్ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ఇక నోట్లో బీడీ పట్టుకొని మరోవైపు రఫ్ లుక్కుతో కనిపించాడు

స్టార్ క్యాస్ట్
నేచురల్ స్టార్ నాని కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమాలో సముద్రఖని కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే మరి కొంతమంది సౌత్ స్టార్ యాక్టర్స్ ఈ సినిమాలో విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నారు. ఇప్పటికే నాని మలయాళం తమిళంలో కూడా ప్రమోషన్స్ మొదలు పెట్టేసాడు. ఎక్కడికి వెళ్లినా కూడా నానికి మంచి రెస్పాన్స్ అయితే వస్తోంది.

భారీ బడ్జెట్
నాని కెరీర్ లోనే ఇది అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఎక్కిన సినిమా. మొదట 50 కోట్లతో అనుకున్న ఈ సినిమాను ఆ తర్వాత 65 కోట్ల బడ్జెట్తో నిర్మించాల్సి వచ్చింది. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఊర మాస్ కాన్సెప్ట్ లో అలరించబోతున్నట్లు ఫస్ట్ లుక్ తోనే ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. సినిమాకు పెట్టిన బడ్జెట్ స్క్రీన్ మీద కనిపిస్తుందని ట్రైలర్ తో ఒక క్లారిటీ ఇచ్చారు.

ట్రైలర్ అదిరింది
ఇక ఇప్పుడు సినిమా ట్రైలర్ కూడా అంతకుమించి అనేలా ఉండడంతో తప్పకుండా సినిమా సక్సెస్ అవుతుంది అని నమ్మకంతో ఉన్నారు. సినిమా ట్రైలర్ తెలంగాణ యాసలో నాని డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇక సినిమాలో హై ఓల్టేజ్ సీన్స్ తో పాటు మంచి ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నట్లు అర్థమవుతోంది.
నాని బాక్సాఫీస్ టార్గెట్
ఇక దసరా సినిమాను మార్చి 30వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు పోటీగా కూడా పెద్దగా ఇలాంటి సినిమాలు రావడం లేదు. కాబట్టి బాక్స్ ఆఫీస్ వద్ద తప్పకుండా మొదటి రోజే ఊహించని స్థాయిలో కలెక్షన్ వచ్చే అవకాశం ఉంది అని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ సినిమాతో ఎలాగైనా నాని 100 కోట్ల మార్కెట్ కూడా అందుకోవాలని చూస్తున్నాడు. మరి సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











