థియేటర్లలో నాని V.. అనుష్క కూడా అదే బాటలో..
చాలా రోజుల తరువాత థియేటర్స్ కి అసలు పరీక్ష మొదలు కానుంది. దాదాపు ఆరు నెలల నుంచి ఎలాంటి ఆదాయం లేకుండా భారీ స్థాయిలో నష్టపోయిన థియేటర్స్ యాజమాన్యం భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే విషయంలో అక్టోబర్ 15 తరువాత ఒక క్లారిటీ రానుంది. మొత్తనికైతే యధావిధిగా థియేటర్స్ ఓపెన్ చేసుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ అయితే లభించింది.
అయితే ముందుగా ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతాయి అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. కరోనా అయితే ఇంకా తగ్గలేదు. ఇక ఇలాంటి సమయంలో ఎంటర్టైన్మెంట్ కోసమని ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎందుకని జనాలు ఆలోచిస్తే మళ్ళీ ఇబ్బందులు తప్పవు. అసలు మ్యాటర్ లోకి వస్తే నాని V సినిమాతో పాటు అనుష్క నిశ్శబ్దం సినిమాలు థియేటర్స్ లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలు ఇప్పటికే ఓటీటీలో విడుదలైన దారుణమైన టాక్ ను సొంతం చేసుకున్నాయి.

అలాంటిది థియేటర్స్ లో విడుదల చేస్తే జనాలు ఎంతవరకు ఇంట్రెస్ట్ చూపిస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. కానీ ఓటీటీపై అవహగన లేని ఏరియాల్లో తప్పకుండా ఆ సినిమాలను వీక్షించే అవకాశం ఉందని అలాగే థియేటర్స్ ఫీల్ కోసం వచ్చే ఆడియెన్స్ కూడా ఉండవచ్చని కొందరు నమ్మకంతో ఈ విధంగా అడుగులు వేస్తున్నారు. ఇక అక్టోబర్ తరువాత త్వరలో రామ్ రెడ్, అలాగే రవితేజ క్రాక్ సినిమాలు డైరెక్ట్ గా థియేటర్స్ లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. వ్యక్తి గత దూరం పాటిస్తు కేవలం 50% సీట్లకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో టికెట్ల రేట్లు, పార్కింగ్ రేట్స్ పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











