నాని V నుంచి స్పెషల్ అప్డేట్.. ఓటీటీలోనే రాబోతోందా?
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్‌లో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరు. ఆయన తెరకెక్కించే ప్రతీ సినిమా ఓ ప్రయోగమే. అది లవ్ స్టోరీ అయినా, స్పోర్ట్స్ డ్రామా అయినా కామెడీ అయినా సరే అందులో ఓ స్పెషాల్టీ ఉండాల్సిందే. అందుకే అష్టాచమ్మా, అమీతుమీ, గోల్కొండ హైస్కూల్, సమ్మోహనం వంటి కూల్ హిట్స్ ఎన్నో వచ్చాయి. హీరో నాని, సుధీర్‌లకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన ఇంద్రగంటి ఈ ఇద్దరితో మల్టీ స్టారర్‌గా V చిత్రం తెరకెక్కించాడు.
దిల్ రాజు నిర్మించిన V చిత్రం మామూలుగా అయితే ఈ పాటికే థియేటర్లలో సందడి చేయాల్సింది. కరోనా వచ్చి అంతా తారుమారు చేసింది. లాక్ డౌన్ రావడం, షూటింగ్, థియేటర్స్ మూతపడటంతో అంతా తలకిందులైంది. ఈ చిత్రం విడుదలలోనూ ఎన్నో మలుపులు చోటు చేసుకుంటున్నాయి. థియేటర్లలో విడుదల చేయాలా? లేదా ఓటీటీ ఆఫర్లకు తలొగ్గాలా అనే తర్జనభర్జనలు జరుగుతున్నాయి.

ఇది వరకే ఎన్నో సార్లు V సినిమాపై వస్తోన్న రూమర్లను ఖండించారు. అయితే తాజాగా నాని ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశాడు. అందులో V చిత్రాన్ని ఓటీటీ మీద రిలీజ్ చేస్తోన్నట్టు హింట్ ఇచ్చాడు. మళ్లీ మళ్లీ చూడొచ్చు.. ఫస్ట్ డే ఫస్ట్ షో అనే కాన్సెప్ట్ మిస్ అవుతున్నామని చెబుతూ రేపు (ఆగస్ట్ 20) ఓ స్పెషల్ అప్డేట్ ఇవ్వబోతోన్నట్టు తెలిపారు. అదితీ రావ్ హైదరీ, నివేదా థామస్ నటిస్తోన్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











