twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోహన్ బాబు సాయిం- అల్లు అరవింద్ మద్దతుతో , వరణ్ తేజ, నాని కలిసి

    By Srikanya
    |

    హైదరాబాద్: ''రైట్స్ విషయంలో మోహన్‌బాబుగారు సహాయం చేశారు. ఆయనకు ధన్యవాదాలు. ఫైనాన్షియల్‌గా అల్లు అరవింద్ మద్దతునిచ్చారు'' అన్నారు నిర్మాత ప్రవీణ్ కుమార్ వర్మ. ఆయన భారీ రేటుకు కొని తెలుగులో విడుదల చేస్తున్న చిత్రం కబాలి. సంతోష్‌ నారాయణ్‌ సంగీతం అందించిన ఈ చిత్ర తెలుగు పాటలని ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్బంగా ఈ విషయాన్ని తెలియచేసారు.

    రజనీకాంత్‌ హీరో గా నటించిన చిత్రం 'కబాలి'. రాధికా ఆప్టే హీరోయిన్. పా రంజిత్‌ దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో వచ్చే నెల 15న ఈ చిత్రం విడుదల కాబోతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని షణ్ముఖ ఫిల్మ్స్‌ సంస్థ అందిస్తోంది. ఈ సందర్భంగా నిప్పురా పాట ఇప్పుడు ఎక్కడ చూసినా తెలుగునాట అదే వినిపిస్తోంది.

    నిర్మాత ప్రవీణ్‌కుమార్ వర్మ మాట్లాడుతూ - ''తూర్పు గోదావరిలో డిస్ట్రిబ్యూటర్‌గా నా ప్రయాణం స్టార్ట్ చేశాను. ఓ పెద్ద సినిమా చేయాలని కేపీ చౌదరి అన్నప్పుడు 'కబాలి' బాగుంటుందనుకున్నా అని చెప్పుకొచ్చారు.

    ఆడియో పంక్షన్ పూర్తి విశేషాలు , ఫొటోలతో స్లైడ్ షోలో ....

    వరుణ్ తేజ, నాని

    వరుణ్ తేజ, నాని

    సంతోష్ నారాయణన్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని వరుణ్ తేజ్ ఆవిష్కరించారు.

    నాని చేతుల మీదుగా

    నాని చేతుల మీదుగా

    అలాగే ఈ చిత్రం టీజర్‌ని హీరో నాని విడుదల చేశారు

    లోగోని

    లోగోని

    షణ్ముఖ ఫిలింస్ లోగోని టి. సుబ్బిరామి రెడ్డి ఆవిష్కరించారు.

    వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ....

    వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ....

    ‘‘పెదనాన్నగారి ‘ఇంద్ర' చిత్రీకరణ స్విట్జర్లాండ్‌లో జరుగుతున్నప్పుడ అక్కడికి వెళ్లా. ఆ సమయంలో రజనీ సార్‌ని తొలిసారి కలిశా. ఆయన ఎంత సింపుల్‌గా ఉంటారో నాకు అర్థమైంది. ‘బాషా' తరవాత రజనీసార్‌ని ఆ తరహా పాత్రలో చూపిస్తున్నారు రంజిత్‌. ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా'' అన్నారు.

    నాని మాట్లాడుతూ...

    నాని మాట్లాడుతూ...

    ‘‘రజనీసార్‌కి నేను వీరాభిమానిని. చిన్నప్పుడు అందరిలానే నేనూ రజనీకాంత్‌గారిని అనుకరించాలని చూసేవాణ్ని. శంకర్‌గారంటే నాకు చాలా ఇష్టం. కానీ ఆయన తీస్తున్న ‘2.0' కంటే ‘కబాలి'పైనే నా ధ్యాస మళ్లింది. ఎందుకంటే రజనీసార్‌ని రోబోలా చూడ్డం కంటే ఓ ‘బాషా'లా చూడ్డంలోనే ఎక్కువ కిక్‌ ఉంద''అన్నారు.

    టి సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ..

    టి సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ..

    ‘‘రజనీ కోహినూర్‌ వజ్రం లాంటి నటుడు. అమితాబ్‌బచ్చన్‌ ‘రోటీ కపడా మకాన్‌' చిత్రాన్ని నేను రజనీకాంత్‌తో రీమేక్‌ చేశా. నటనలో అమితాబ్‌ని దాటేశాడు రజనీకాంత్‌'' అన్నారు టి.సుబ్బరామిరెడ్డి.

    ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ...

    ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ...

    ‘‘ప్రపంచంలోని వ్యక్తితాన్ని ఓ త్రాసులో.. రజనీకాంత్‌ని ఓ త్రాసులో వేస్తే తూకం రజనీవైపే మొగ్గుతుంది. మాటతప్పని గుణవంతుడు రజనీకాంత్‌. ‘బాబా' సినిమాకి తెలుగులో మమ్మల్ని మాటలు రాయమన్నారు. కానీ ‘మేం లిప్‌ సింక్‌ చూసి మాటలు రాయలేం.. క్షమించండి' అన్నాం. మమ్మల్ని ఆయన అర్థం చేసుకొన్నారు''అన్నారు.

    బి.గోపాల్ మాట్లాడుతూ..

    బి.గోపాల్ మాట్లాడుతూ..

    ‘‘రజనీ సంభాషణల కోసం ‘బాషా' చిత్రాన్ని పదిసార్లు చూశా. రజనీ నవ్వు కోసం ‘కబాలి' చిత్రాన్ని పదిసార్లు చూస్తాన''న్నారు బి.గోపాల్‌.

    సంతోష్ నారాయణ్ మాట్లాడుతూ..

    సంతోష్ నారాయణ్ మాట్లాడుతూ..

    తెలుగు సినిమాలకు పనిచేయాలని ఉందన్నారు సంతోష్‌ నారాయణ్‌

    దర్శకుడు రంజిత్ మాట్లాడుతూ..

    దర్శకుడు రంజిత్ మాట్లాడుతూ..

    ‘‘ఈ సినిమాపై చాలా అంచనాలున్నాయని తెలుసు. వాటిని అందుకొంటామన్న నమ్మకం ఉంద''న్నారు దర్శకుడు.

    ఎవరెవరు

    ఎవరెవరు

    ఈ కార్యక్రమంలో కోదండరామిరెడ్డి, పుల్లెల గోపీచంద్‌, చాముండేశ్వరీనాథ్‌, రామజోగయ్య శాస్త్రి, ప్రతాని రామకృష్ణ గౌడ్‌, ప్రసన్న కుమార్‌, ప్రవీణ్‌కుమార్‌ వర్శ, కె.పి.చౌదరి, పార్లమెంట్‌ సభ్యులు అవంతి శ్రీనివాస్‌, ధన్యబాలకృష్ణన్‌, సుధీర్‌ వర్మ, సాయి ధన్సిక, ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు

    English summary
    Kabali Telugu audio launch event held at Hyderabad. Celebs like Nani, Dhansika, Pa Ranjith, TSR, Kalaiyarasan, Santhosh Narayanan, Paruchuri Gopalakrishna, B Gopal, Ramajogayya Sastry, Varun Tej, Ritu Varma, Srikanth Kidambi, Prasanna Kumar, Ananth, Kodandarami Reddy, MP Avanthi Srinivas, Sudhakar Komakula, Pratani Ramakrishna Goud, Singer Arunraj Kamaraju, Chamundi, Raghu Ramakrishnam Raju, Pullela Gopichand, Jhansi, Ganesh Ram, Nisha and others graced the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X