నాని హీరో కాదు విలన్ అంటున్న దర్శకుడు
ఈ సినిమాకి విలన్ నాని. ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని మార్చుకోవడమే ఈ సినిమా ఇతివృత్తం. అందరికీ ఈ చిత్రం నచ్చుతుంది అంటున్నారు 'పిల్ల జమిందార్' దర్సకుడు అశోక్. నాని హీరోగా హరిప్రియ, బిందుమాధవి హీరోయిన్లుగా శైలేంద్ర సినిమాస్ పతాకంపై ఎస్.ఎస్. బుజ్జిబాబు నిర్మిస్తున్న 'పిల్ల జమిందార్' పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లో రీసెంట్ గా విడుదలయ్యాయి. ఆ ఆడియో పంక్షన్ లో దర్శకుడు అలా స్పందించాడు. ఇక రాజమౌళి మాట్లాడుతూ..."నాని అచ్చ తెలుగు కథానాయకుడు. సినిమా ఆసక్తిగా ఉంటుందని భావిస్తున్నా. సంగీతం బాగుంది'' అన్నారు. ఈ సినిమా పాటలు బాగున్నాయనీ, తొలి రోజే సినిమా చూస్తాననీ దిల్ రాజు చెప్పారు.
హీరో నాని మాట్లాడుతూ "మేము చూపించిన లఘు చిత్రం అందరికీ నచ్చిందని భావిస్తున్నా. దానికంటే చిత్రం వంద రెట్లు బాగుంటుందని నమ్మకంగా చెబుతున్నా'' అన్నారు. సమర్పకుడు డి.యస్. రావు మాట్లాడుతూ "ఈ సినిమా ప్రారంభమైన తర్వాత సమ్మెతో పాటు పలు ఆటంకాలు ఎదురైనా సంతృప్తిగా పూర్తి చేశాం. విజయదశమికి సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం. సెల్వ గణేశ్ కొత్త తరహాలో సంగీతం ఇచ్చారు. పదేళ్ల నుంచీ హిట్ కావాలనే ఆకలితో ఉన్న నేను ఈ సినిమాతో అది తీరుతుందని నమ్ముతున్నా'' అని చెప్పారు.


Click it and Unblock the Notifications











