twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంట్రెస్టింగ్‌గా నాని కొత్త సినిమా టైటిల్: సర్‌ప్రైజింగ్ వీడియోను వదిలిన చిత్ర యూనిట్

    |

    అద్భుతమైన నటనతో ఎన్నో సినిమాలను వన్ మ్యాన్ షోగా మార్చుకుని స్టార్ హీరోగా ఎదిగిపోయాడు నేచురల్ స్టార్ నాని. సహజసిద్ధమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే, 'జెర్సీ' తర్వాత ఆ తరహా హిట్‌ను అందుకోలేకపోయిన ఈ హీరో.. ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే 'టాక్ జగదీష్, 'శ్యామ్ సింగరాయ్' వంటి చిత్రాలను ప్రకటించాడు. ఇవి పట్టాలపై ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

    'మెంటల్ మదిలో', 'బ్రోచేవారెవరురా' వంటి ఆసక్తికరమైన సినిమాలను తెరకెక్కించిన వివేక్ ఆత్రేయతో మరో సినిమాను ప్రకటించాడు నాని. ఒక ఫ్రెష్ కాన్సెప్ట్‌తో మ్యూజిక‌ల్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాబోతున్న ఈ సినిమాలో మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా ఫహాద్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్ య‌ల‌మంచిలి నిర్మిస్తున్నారు. అలాగే, వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నాడు.

    Nani - Vivek Athreya Movie Title: Ante Sundaraniki

    తాజాగా ఈ సినిమా కర్టన్‌రైజర్ వీడియో విడుదలైంది. ఎంతో ఆసక్తికరంగా సాగిన ఈ వీడియోలో సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు. ఈ చిత్రానికి 'అంటే.. సుందరానికీ' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను పెట్టారు. ఇక, ఈ సినిమా పోస్ట‌ర్ బ్యాగ్రౌండ్‌లో గ‌మ్యం చేరుకోవ‌డానికి వెళ్తున్న ఒక విమానం, ఒక వీణ‌, కెమెరాలు, ట్రావెలింగ్ బ్యాగ్ లాంటివి క‌నిపిస్తున్నాయి. అంటే ఇది పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనే విషయం సుస్పష్టం అవుతోంది. దీంతో ఈ సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు ఏర్పడ్డాయి.

    ఇదిలాఉండగా, నాని నటించిన 'V' కొద్ది రోజుల క్రితం ప్రముఖ డిజిటల్ మీడియా దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. అయితే, నాని నటన మాత్రం ఎప్పటి లానే మెప్పించింది.

    English summary
    Official Curtain Raiser of #Nani28 on Mythri Movie Makers. #Nani28 is an upcoming telugu film Starring ‘Natural Star’ Nani & Nazriya Fahadh. Written & Directed by Vivek Athreya. Produced by Naveen Yerneni & Ravi Shankar Y under Mythri Movie Makers. Vivek Sagar to score the music.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X