Don't Miss!
- Lifestyle చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటిస్తే..విజయం వద్దన్నా వస్తుంది..
- Technology 100mbps అధిక వేగంతో Airtel Xstream AirFiber కొత్త ప్లాన్లు! ప్లాన్ల వివరాలు
- Finance Market Closing: సెన్సెక్స్-నిఫ్టీ ఢమాల్.. మూడోరోజూ కొనసాగిన అమ్మకాల ఒత్తిడి..
- Sports ఆర్సీబీలో ఆడే ఇండియన్ ప్లేయర్లకు ఇంగ్లీషే రాదు: సెహ్వాగ్ సెన్సేషన్
- News పెళ్లి జరిగిన రెండు నెలలకే ఫ్లైఓవర్ మీదకు వెళ్లాడు. కరెంట్ ఆఫీసులో ఉద్యోగం, ఏం జరిగింది !
- Automobiles వయసు కేవలం నెంబర్ మాత్రమే.. ఖరీదైన జాగ్వార్ F టైప్ స్పోర్ట్స్ కారులో బామ్మ చక్కర్లు
- Travel ఆరు రోజుల్లో కేరళలోని ఈ ప్రాంతాలు చూడొచ్చు..
ఇంట్రెస్టింగ్గా నాని కొత్త సినిమా టైటిల్: సర్ప్రైజింగ్ వీడియోను వదిలిన చిత్ర యూనిట్
అద్భుతమైన నటనతో ఎన్నో సినిమాలను వన్ మ్యాన్ షోగా మార్చుకుని స్టార్ హీరోగా ఎదిగిపోయాడు నేచురల్ స్టార్ నాని. సహజసిద్ధమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే, 'జెర్సీ' తర్వాత ఆ తరహా హిట్‌ను అందుకోలేకపోయిన ఈ హీరో.. ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే 'టాక్ జగదీష్, 'శ్యామ్ సింగరాయ్' వంటి చిత్రాలను ప్రకటించాడు. ఇవి పట్టాలపై ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
'మెంటల్ మదిలో', 'బ్రోచేవారెవరురా' వంటి ఆసక్తికరమైన సినిమాలను తెరకెక్కించిన వివేక్ ఆత్రేయతో మరో సినిమాను ప్రకటించాడు నాని. ఒక ఫ్రెష్ కాన్సెప్ట్‌తో మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాలో మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా ఫహాద్ హీరోయిన్గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. అలాగే, వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నాడు.
తాజాగా ఈ సినిమా కర్టన్‌రైజర్ వీడియో విడుదలైంది. ఎంతో ఆసక్తికరంగా సాగిన ఈ వీడియోలో సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు. ఈ చిత్రానికి 'అంటే.. సుందరానికీ' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను పెట్టారు. ఇక, ఈ సినిమా పోస్టర్ బ్యాగ్రౌండ్లో గమ్యం చేరుకోవడానికి వెళ్తున్న ఒక విమానం, ఒక వీణ, కెమెరాలు, ట్రావెలింగ్ బ్యాగ్ లాంటివి కనిపిస్తున్నాయి. అంటే ఇది పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే విషయం సుస్పష్టం అవుతోంది. దీంతో ఈ సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు ఏర్పడ్డాయి.
ఇదిలాఉండగా, నాని నటించిన 'V' కొద్ది రోజుల క్రితం ప్రముఖ డిజిటల్ మీడియా దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. అయితే, నాని నటన మాత్రం ఎప్పటి లానే మెప్పించింది.