twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పైసా మూవీ: నాని కాస్టూమ్స్ మైఖేల్ జాక్సన్ రేంజిలో

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ ప్రస్తుతం నాని హీరోగా 'పైసా' చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కేథరిన్, లక్కీ శర్మ హీరోయిన్లుగా చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలింది ఉంది. ఈచిత్రంలో నాని యంగ్ పొలిటీషియన్‌గా కనిపించబోతున్నాడు.

    దర్శకుడు కృష్ణ వంశీ పాటల చిత్రీకరణలో తన క్రియేటివిటీ చూపిస్తున్నారు. నిర్మాతలు కూడా ఆయన క్రియేటివిటీకి తగిన విధంగా భారీగా ఖర్చు పెడుతున్నారు. కేవలం పాటల చిత్రీకరణ కోసం దాదాపు కోటికిపైగా వెచ్చించినట్లు తెలుస్తోంది. అదే విధంగా కాస్టూమ్స్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

    నాని కాస్ట్యూమ్స్ కోసం స్వారోవ్‌స్కి క్రిస్టల్స్ వాడుతున్నారట. ఓక్కో సూట్ కోసం దాదాపు 20 వేల క్రిస్టల్స్ వాడుతున్నారు. వీటితో తయారు చేసే ఒక్కో సూట్ కు రూ. 7.5 లక్షల వరకు ఖర్చవుతుందట. ఇప్పటి వరకు ఇండియాలో ఏ హీరో కూడా ఇలాంటి సూట్ తో పెర్ఫార్మ్ చేయలేదట. ఇంతకీ వీటికున్న ప్రత్యేకత ఏమిటంటే....మైఖేల్ జాక్సన్ ఇలాంటి క్రిస్టల్స్ తో చేసిన కాస్ట్యూమ్స్ వాడేవారని యూనిట్ సభ్యులు అంటున్నారు.

    ఇతర వివరాల్లోకి వెళితే.....గతంలో ఈచిత్రం వైయస్ జగన్ ను ఉద్దేశించి తీస్తున్న చిత్రమని ప్రచారం జరిగింది. ఈనేపథ్యంలో దర్శకుడు స్పందిస్తూ ఈచిత్రం ఎవరిని ఉద్దేశించి ఈచిత్రం తీయడం లేదని స్పష్టం చేశారు. రాజకీయాల నేపథ్యంలోనే సినిమా ఉంటుందని, యంగ్ పొలిటిషీయన్ గా హీరో పాత్ర ఆదర్శ వంతంగా ఉంటుందని చెప్పుకొచ్చారు.

    ఎల్లోఫ్లవర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని మంచి నిర్మాణ విలువలతో నిర్మిస్తోంది. ఈ సినిమాలో కేథరీన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసరాల్లో చిత్రీకరణ సాగుతోంది. గతంలో మిరపకాయ నిర్మించిన రమేష్‌ పుప్పాల నిర్మాత. ఇక గోపీచంద్ మొగుడు తర్వాత కృష్ణవంశీ చేస్తున్న చిత్రం ఇదే. ఆ చిత్రం డిజాస్టర్ కావటంతో కొంత గ్యాప్ తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మొదట ఈ చిత్రానికి పైసాలో పరమాత్మ టైటిల్ అనుకున్నారు. ఆ తర్వాత జెండాపై కపిరాజు అని వార్తలు వచ్చాయ. అయితే పైసాలో పరమాత్మ టైటిల్ వేరే వారు తమ సినిమాకు పెట్టుకుని ఉండటంతో పైసా టైటిల్ ని ఈ చిత్రానికి ఫిక్స్ చేసారు.

    English summary
    Many have known the project Paisa which is Krishna Vamsi’s latest directorial venture starring Nani and debut actress Catherine and Lucky Sharma in the lead roles. Recently when Tollywood’s well known close associate of the director, visited the sets described the song as splendid..It is revealed that Krishna Vamsi, who is already well known for his evergreen song sequences has come up with a never experienced creative conceptual picturisation for the song. The producers have allocated more than Rs.1 crore without even a second thought as it is likely expected to break records and it is going to be the best of his creativity so far.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X