విక్రమ్ ప్రవర్తన చూసి భయపడిపోతున్న నాని.. వీడియో పోస్ట్ చేసి మరీ..
టాలీవుడ్ యంగ్ హీరో నేచురల్ స్టార్ - క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'గ్యాంగ్ లీడర్'. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నానికి జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది. అలాగే 'ఆర్ఎస్ 100' హీరో కార్తికేయ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. వీరితో పాటు ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్, జైజా, సత్య తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ మొదటి నుంచీ సరికొత్త పంథాను ఫాలో అవుతోంది.
'గ్యాంగ్ లీడర్' సినిమా షూటింగ్ ప్రారంభం సమయంలోనే టైటిల్ టీజర్ విడుదల చేయగా, ఈ మధ్య కొద్ది రోజుల గ్యాప్‌లో ప్రీ లుక్, ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్‌లు విడుదల చేశారు. వీటికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు, సినిమాపై అంచనాలు కూడా భారీ స్థాయిలో పెరిగిపోయాయి. గతంలో ప్రకటించిన దాని ప్రకారం చిత్ర యూనిట్ రెండు రోజుల క్రితం సినిమా టీజర్‌ను విడుదల చేసింది. దీనికి కూడా భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో చిత్ర యూనిట్ ఖుషీగా ఉంది.

ఈ నేపథ్యంలో నాని.. తాజాగా ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అయితే, ఇది సినిమా గురించి మాత్రం కాదు.. 'గ్యాంగ్ లీడర్' డైరెక్టర్ విక్రమ్ కే కుమార్‌కు సంబంధించింది. ఈ సినిమా సెట్‌లో విక్రమ్ ఓ పాపతో ఆడుకుంటున్నాడు. దానికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన నాని.. ''మా 'గ్యాంగ్ లీడర్' డైరెక్టర్ విక్రమ్ కుమార్ సెట్స్‌లో ఏం చేస్తున్నాడో చూడండి. నాకు భయంగా ఉంది' అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగస్టు చివరి వారంలోగానీ, సెప్టెంబర్ మొదటి వారంలో గానీ విడుదల చేద్దామని చిత్ర యూనిట్ భావించింది. అయితే, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సాహో' ఆగస్టు 30న వస్తుండడంతో 'గ్యాంగ్ లీడర్' టీమ్ ఆలోచనలో పడిపోయింది.


Click it and Unblock the Notifications











