డిసెంబర్ 9న ‘నేను నాన్న నా బాయ్ ఫ్రెండ్స్’
ఆ అమ్మాయికి వాళ్ల నాన్నంటే ప్రాణం. తండ్రికి కూతురంటే ఆరోప్రాణం. పుట్టినప్పటి నుంచి పాదం కందకుండా పెంచుతాడు కుమార్తెను. అలాంటిది అమ్మాయికి ఈడొచ్చాక బాయ్ ఫ్రెండ్స్ అనే పేరుతో ఆమె జీవితంలోకి ముగ్గురొస్తారు. ఇంతకీ ఎవరా ముగ్గురు? ఆ ముగ్గురి పట్ల ఆమె తండ్రికున్న అభిప్రాయం ఏంటి? అసలు ఆ అమ్మాయి నాన్న, నేను నా బాయ్ ఫ్రెండ్స్ అని ఎందుకు చెప్పింది? ఎవరితో చెప్పింది? ఆ చెప్పిన దాన్లో ఉన్న అంతరార్థం ఏంటి? వంటి ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కిన చిత్రం నాన్న- నేను - నా బాయ్ ఫ్రెండ్స్. లక్కీ మీడియా పతాకంపై రూపొందింది. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మానస, మహాలక్ష్మి ఈ చిత్రానికి సమర్పకులు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు విడుదల చేస్తున్నారు. రావు రమేశ్, హెబ్బా పటేల్, తేజస్వి మడివాడ, అశ్విన్ బాబు, పార్వతీశం, నోయల్ సేన్ కీలక పాత్రల్లో నటించారు. . బెక్కం వేణుగోపాల్ (గోపి) నిర్మాత. భాస్కర్ బండి దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











