సక్సెస్ కాదు, ఫీల్: ఎన్టీఆర్ (నాన్నకు ప్రేమతో సాంగ్ రిలీజ్ ఫోటోస్)
హైదరాబాద్: ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాన్నకు ప్రేమతో' చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్ శనివారం హైదరాబాద్ లో ప్రత్యేకంగా రిలీజ్ చేసారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటను స్వయంగా రచించి, సంగీతం అందించి ఆయనే పాడారు. ఇటీవల పరమపదించిన తన తండ్రి సత్యమూర్తికి అంకితం ఇస్తూ ఈ సాంగ్ రిలీజ్ చేసారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ...‘నాన్నకు ప్రేమతో' చిత్రం ఒక గొప్ప విజయంతో పాటు, నేను బ్రతికినంత కాలం గుర్తుంచుకునే ఒక అనుభూతిని మిగిల్చిన చిత్రం. అందుకు కారణమైన సుకుమార్ గారికి థాంక్స్. ఇది కేవలం సక్సెస్ కాదు...ఒక ఫీల్. ‘నాన్నకు ప్రేమతో' చిత్రం ఒక బొమ్మయితే దేవిశ్రీ తన సంగీతంతో ఆ బొమ్మకు ప్రాణం పోసారు. దేవిశ్రీ ప్రసాద్ నాన్నగారు సత్యమూర్తిగారే ఇంత మంచి సాంగ్ రాయించారని అనుకుంటున్నాను అన్నారు.
జానకి రాం అన్నయ్య నన్ను అమ్మ అని పిలుస్తారు. మా నాన్నగారు, కళ్యాణ్ అన్నయ్య, వివి వినాయక్ గారు ఇలా కొంత మంది మాత్రమే నన్ను నాన్న.. అని ప్రేమగా పిలుస్తుంటారు. వారిలో రాజేంద్రప్రసాద్ ఒకరు. ఈ సినిమాలో ఆయన నాన్న పాత్రకు ప్రాణం పోసారు. ఎన్నో లక్షల మంది, కోట్ల మంది తండ్రుల ఫేస్ రాజేంద్రప్రసాద్ గారి ముఖంలో కనిపించింది అన్నారు.
ఈ సినిమా చేయడానికి నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది అభిమానులే. అభిమానులకు ప్రేక్షకులు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అన్నారు. స్లైడ్ షోలో నాన్నకు ప్రేమతో సాంగ్ లాంచ్ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, నాన్నకు ప్రేమతో సాంగ్ వీడియో....

రాత్రికి రాత్రే కంపోజ్ చేసిన దేవిశ్రీ
సినిమా షూటింగ్ చివరి రోజు రాత్రికి రాత్రే దేవిశ్రీ ఈ పాటను కంపోజ్ చేసాడని సుకుమార్ చెప్పుకొచ్చారు.

తారక్
తారక్ లేకుంటే ఈ సినిమా లేదు. ఒక ఎమోషనల్ సినిమాకు తన కమర్షియల్ సినిమా వాల్యూస్ తో ఆడియన్స్ ను థియేటర్ కు రప్పించిన హీరో తారక్ అన్నారు సుకుమార్.

దేవిశ్రీ
ఈలోకంలో అందరూ కనెక్ట్ అయ్యేది అమ్మా, నాన్న ఎమోషన్స్ కి మాత్రమే. ఈ సినిమా నా రియల్ లైఫ్ రిలేటెడ్ అయింది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ చివరి సీన్లో నవ్వుతూ కన్ను మూసినట్లే, మా నాన్నగారు కూడా అమ్మను చూస్తూ నవ్వుతూ కన్నుమూసారు అని తెలిపారు దేవిశ్రీ.

రాజేంద్ర ప్రసాద్
నా మనసుకు హత్తుకున్న సినిమా ఇది. సినిమాలన్నీ కథలతోనే తయారవుతాయి. కానీ ఇందులో కథకంటే ప్రాణమే ఎక్కువగా ఉంది. ప్రపంచంలో ఎక్కువగా అమ్మ గురించే సినిమాలు ఉంటాయి. కానీ సుకుమార్ అద్భుతమైన కమర్షియల్ హీరోతో థ్రిల్ ఫీలయ్యే నాన్న సినిమా తీసాడు అన్నారు రాజేంద్రప్రసాద్.
నాన్నకు ప్రేమతో సాంగ్ వీడియో
ఈ పాటను దేవిశ్రీ ప్రసాద్ స్వయంగా రాసి, తన సోదరుడితో కలిసి పాడారు.


Click it and Unblock the Notifications











