‘బిగ్ బాస్’ రిలీజ్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు!
సూపర్ స్టార్ మహేష్ బాబు బిగ్ బాస్ రియాల్టీ షోకు వచ్చారేమో.. అనుకుంటున్నారా? అలాంటిదేమీ లేదండీ. ఈ షోకు మహేష్ బాబుకు ఎలాంటి సంబంధం లేదు. 'బిగ్ బాస్' అనే సినిమా పాటను ఆయన తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.

మహేష్ బాబు బావ సుధీర్ బాబు హీరోగా ప్రస్తుతం 'నన్ను దోచుకుందువటే' చిత్రం తెరకెక్కుతోంది. ఆర్‌ఎస్ నాయుడు దర్శకత్వం వహిస్తున్న ఈ చితరాన్ని సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
సినిమా ప్రమోషన్లో భాగంగా మహేష్ బాబుతో 'బిగ్ బాస్' పాటను విడుదల చేయించారు. కృష్ణాజీ రాసిన ఈ పాటను టిపు, హర్షిక దేవనాథన్ పాడారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. సాంగ్ లిరిక్స్, చిత్రీకరించిన విధానం విభిన్నంగా ఉంది. స్మశానం థీమ్‌తో రూపొందించారు.
ఈ చిత్రంలో ఉద్యోగులను టార్చర్ పెట్టే బాస్ పాత్రలో సుధీర్ బాబు నటిస్తున్నారు. నభ నతేశ్ ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఈ మూవీలో సుధీర్ బాబు, నభ నతేశ్, నాజర్, తులసి, వేణు, రవి వర్మ, జీవా, వర్షిణి, సౌందర రాజన్, సుదర్శన్ తదితరులు నటిస్తున్నాడు. డిఓపి - సురేష్ రగుతు, మ్యూజిక్ డైరెక్టర్ - అజనీష్ బి లోకనాథ్, ఆర్ట్ డైరెక్టర్ - శ్రీకాంత్ రామిశెట్టి, ఎడిటర్ - ఛోటా కె ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఎస్. సాయి వరుణ్, నిర్మాత - సుధీర్ బాబు, స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ - ఆర్ ఎస్. నాయుడు.


Click it and Unblock the Notifications











